ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో భాగంగా ఎంతో మంది యువ ఆటగాళ్లు తెరమీదికి వచ్చారూ అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లో తమకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బాగా రాణించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.  ఇలా ఐపీఎల్లో బాగా రాణించిన యువ ఆటగాళ్లలో అటు కుమార్ కార్తికేయ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఫ్యాషన్ గా బతికిన ఈ ఆటగాడు ఎన్నో రోజుల పాటు నెట్ బౌలర్ గా కొనసాగాడు. ఇటీవలే అదృష్టవశాత్తు ముంబై ఇండియన్స్ లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు.


 రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేసిన కుమార్ కార్తికేయ తన అద్భుతమైన స్పిన్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి.  కీలకమైన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ వికెట్ సాధించాడు. ఈ క్రమంలోనే అదే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ ఏకంగా రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇకపోతే ఇటీవలే ముంబై ఇండియన్స్ ఒక వీడియో తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా పలు విషయాలను పంచుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తన తొలి వికెట్ పడగొట్టగానే తన తండ్రి శ్యామ్ ఇలా సెలబ్రేషన్స్ జరుపుకున్నాడో కార్తికేయ చెప్పుకొచ్చాడు. నేను రాజస్థాన్ తో మ్యాచ్ ఆడుతున్నాను అని  మా నాన్నకి చెప్పాను.  అతడు తన మొత్తం పోలీస్ బెటాలియన్ కి ఈ విషయం చెప్పాడు. వారు అంతా ప్రొజెక్టర్ అమర్చుకుని మరి మ్యాచ్ వీక్షించారు.  నేను నా మొదటి వికెట్ సాధించగానే అందరూ నిలబడి చప్పట్లు కొట్టారు. ఆనందంలో మునిగి పోయిన మా నాన్నను అందరు కౌగిలించుకున్నారు. ఇక మ్యాచ్ అనంతరం ఈ వీడియోని నాన్న నాతో షేర్ చేసుకున్నారు వీడియో చూడగానే ఎంతో ఆనందం కలిగింది కంటూ చెప్పుకొచ్చాడు కుమార్ కార్తికేయ..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl