ఇటీవల ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కెప్టెన్గా ఎంపిక అయిన బెన్ స్టోక్స్ కీ ప్రపంచ క్రికెట్లో కూడా మంచి గుర్తింపు ఉంది   కేవలం ఇంగ్లాండ్ ప్రేక్షకులు మాత్రమే కాదు ఇతర దేశాల ప్రేక్షకులు సైతం అతని ఆటను ఎంతగా ఇష్టపడుతు ఉంటారు. ముఖ్యంగా అటు ఐపీఎల్ కారణంగా భారత క్రికెట్ ప్రేక్షకులూ కూడా బెన్ స్టోక్స్ ను అభిమానిస్తూ ఉంటారూ అన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీ లో ఆడుతున్న బెన్ స్టోక్స్ అద్భుతమైన ఫామ్ లో కనిపిస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.


 ఇకపోతే ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీ లో డార్హం జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు బెన్ స్టోక్స్. వర్సెస్టర్ షైర్ తో జరిగిన మ్యాచ్ లో 88 బంతుల్లో 121 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు  ఇటీవల ఇదే ఫామ్ను కంటిన్యూ చేస్తూ గ్లామర్గాన్ తో జరుగుతున్న మ్యాచ్లో బెన్ స్టోక్ 110 బంతుల్లో 92 పరుగులు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే న్యూజిలాండ్ తో జరుగబోతున్న టెస్టు సిరీస్కు ముందు బెన్ స్టోక్స్ కి ఇది మంచి ప్రాక్టీస్ గా మారిపోతుంది. అది సరే గానీ ఇప్పుడు బెన్ స్టోక్స్ గురించి ఎందుకు మాట్లాడు కోవాల్సి వచ్చింది అని అంటున్నారు కదా.


 గ్లామర్గాన్ తో జరిగిన మ్యాచ్ లో బౌలర్ మార్నస్ లబుషేన్ వేసిన ఒక బంతి బెన్ స్టోక్ నడుము కింది భాగంలో తగిలింది  దీంతో ఒక్కసారిగా క్రేజ్ లోనే కిందపడిపోయాడు స్టోక్స్  కాసేపు చూస్తున్నప్పుడు ఇదంతా సీరియస్ గా అనిపించింది. కానీ ఆ తర్వాత బెన్ స్టోక్స్ ఇదంతా ఫన్నీగా చేస్తున్నాడు అని అందరికీ అర్థమైంది. బెన్ స్టోక్స్ కి పెద్దగా ఎలాంటి దెబ్బలు తగలలేదు. కాని తన కాలుని స్ట్రిచ్ చేసుకోవడానికి స్టోక్స్ ఇలా క్రీజు లో పడిపోయాడు అనేది తెలుస్తుంది . బెన్ స్టోక్స్ కింద పడిపోవడంతో ఏం జరిగిందని పరిగెత్తుకొచ్చిన బౌలర్ లబుశేన్ అసలు విషయం తెలుసు కుని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: