గత రాత్రి బెంగళూర్ మరియు పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ గెలవడం రెండు జట్లకు చాలా అవసరం. అయితే కీలక సమయంలో అన్ని విభాగాలలో పంజాబ్ జట్టు తమ సత్తా ఏమిటో చూపించి మ్యాచ్ ను గెలుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్ లలో బైర్ స్టో మరియు లివింగ్ స్టన్ ల దాటికి 209 పరుగుల భారీ స్కోరు చేసింది. బదులుగా బెంగళూర్ కేవలం 155 పరుగులకు పరిమితం అయింది. దీనితో 54 పరుగుల తేడాతో పంజాబ్ చేతిలో ఓటమి పాలయింది. అయితే ఓటమి అంతరం ఎక్కువ ఉండడంతో బెంగళూర్ రన్ రేట్ చాలా దారుణంగా పడిపోయింది. ఏకంగా మైనస్ లోకి వచ్చేసింది.

దీనితో బెంగళూర్ ప్లే ఆప్ ఆశలు గల్లంతు అయ్యేలా ఉన్నాయి. ఎందుకంటే... ఇక బెంగళూర్ కు మిగిలింది ఒకే ఒక్క మ్యాచ్ కావడం అందులోనూ ఆ మ్యాచ్ కూడా ఇప్పటికే ప్లే ఆఫ్ కు చేరుకున్న గుజరాత్ టైటాన్స్ తో కావడంతో బెంగళూర్ అభిమానులు నిరాశలో ఉన్నారు. కనీసం ప్లే ఆఫ్ బరిలో నిలవాలంటే లాస్ట్ మ్యాచ్ లో గుజరాత్ పై భారీ తేడాతో గెలవాలి అప్పుడే ఏమైనా అవకాశాలు ఉంటాయి. మరి ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది. ఇక పంజాబ్ ఈ మ్యాచ్ లో విజయంతో ఏకంగా 8 వ స్థానం నుండి 6 వ స్థానానికి చేరుకోవడంతో పాటు రన్ రేట్ ను కూడా అమోఘంగా మెరుగుపరుచుకుంది.

ఇక మిగిలిన రెండు మ్యాచ్ లలోనూ ఇదే విధమైన ప్రదర్శన కనబరిస్తే పంజాబ్ ప్లే ఆఫ్ చేరడం పక్కా. మరి మిగతా మ్యాచ్ ల మీద కూడా ఆధారపడుతుంది. మరి తర్వాత జరిగే గుజరాత్ మ్యాచ్ లో ఏమి జరగనుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: