పంజాబ్ కింగ్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు పూర్తి ఆదిపత్యాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు బెంగళూరు బౌలర్లపై చెలరేగి సిక్సర్లు ఫోర్లతో విరుచుకు పడ్డారు. ఈ క్రమంలోనే మొన్నటివరకు బెంగళూరు జట్టులో  వికెట్ టేకర్ గా పరుగుల ను కంట్రోల్ చేసే బౌలర్ గా  ఉన్న జోష్ హాజిల్ వుడ్ ఇక ఇటీవల పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం ఒక చెత్త రికార్డు నమోదు చేశాడు. అతడు ఎలాంటి బంతులని సంధించిన పంజాబ్ బ్యాట్స్మెన్లు మాత్రం సిక్సర్లు కొట్టాడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.



 ఈ క్రమంలోనే 4 ఓవర్లు వేసిన హేజల్ వుడ్  భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 4 ఓవర్లు వేసి 64 పరుగులు ఇచ్చిన హేజిల్ వుడ్ ఒక్క వికెట్ కూడా తీయకపోయాడు.  తద్వారా చెత్త రికార్డును ఖాతాలో వేసుకుని ఏకంగా 16 పరుగుల ఎకనామితో పరుగులు సమర్పించుకున్నాడు.  ఐపీఎల్ హిస్టరీ లోనే ఎక్కువ పరుగులు సమర్పించుకున్న విదేశీ బౌలర్ గా అప్రతిష్ఠ మూట కట్టుకున్నాడు.  అయితే అంతకు ముందు ఇదే ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ బౌలర్ మార్కో జాన్సన్ గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసి 63 పరుగులు సమర్పించుకున్నాడు. 2021లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున లుంగీ ఎంగిడీ ముంబై ఇండియన్స్ పై 4ఓవర్లు వేసి 61 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు.


 ఇప్పుడు హేజల్ వుడ్ ఏకంగా 4 ఓవర్లు వేసి 64 పరుగులు సమర్పించుకోవడమే కాక ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంతో పాటు అతని బౌలింగ్ బెంగళూరు జట్టుకు ఎక్కడ కలిసి రాలేదనే చెప్పాలి. ఇక గతంలో 2016లో సన్రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో 61 పరుగులు సమర్పించుకున్నాడు షేన్ వాట్సన్.. ఇక 2019 సీజన్ లో టీమ్ సౌదీ 61 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. ఇప్పుడు హేజల్ వుడ్ ఏకంగా వాట్సాన్, సౌతిని దాటి తొలి స్థానంలో నిలిచి చెత్త రికార్డును నమోదు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb