సాధారణంగా టీ20 ఫార్మాట్ అంటేనే ధన ధన్ ఫటా ఫట్  అనే ఆటతీరు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే టెస్ట్ ఫార్మాట్లో అయితే ఎన్ని గంటలైనా వేచి చూసి సరైన షాట్ ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. వన్డే ఫార్మేట్ లో కూడా కొన్ని బంతులు వరకు క్రీజ్ లో కుదురుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ టీ-20 ఫార్మెట్లో అలా కాదు క్రీజులోకి వచ్చిన బ్యాట్స్మెన్ మొదటి బంతి నుంచి సిక్సర్లు ఫోర్లు బాదుతు భారీ స్కోరు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది  బ్యాట్స్మెన్ ల  ప్రతిభకు టి20 ఫార్మాట్ ఒక సవాల్ లాంటిదే అని చెప్పాలి.


 అదే సమయంలో అటు బౌలర్లు కూడా బ్యాట్స్మెన్లను  తక్కువ పరుగులకే కట్టడి చేసేందుకు ఎప్పుడు వైవిధ్యమైన బంతులు సందిస్తూ ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో కూడా ప్రతి మ్యాచ్లో భారీగా పరుగులు చేస్తూ సిక్సర్లు ఫోర్లతో విరుచుకుపడుతున్న ఆటగాళ్లు ఎంతో మంది కనిపిస్తున్నారు అని చెప్పాలి. కాగా ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా అటు లీగ్ మ్యాచ్లు ముగింపు దశకు వచ్చాయి.



 అయితే ఇక ఈ ఏడాది ఐపీఎల్లో సిక్సర్లతో విరుచుకుపడి ప్రత్యర్థిపై ఆధిపత్యం సాధించిన జట్టు ఏది అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఏడాది అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రస్తుతం ఎక్కువ సిక్సర్లు కొట్టిన జట్టుగా మొదటి స్థానంలో ఉంది.  ఇప్పటివరకు 108 సిక్సర్లు కొట్టింది ఆ జట్టు. ఇక ఆ తర్వాత 96 సిక్సర్లతో పంజాబ్ కింగ్స్ జట్టు రెండవ స్థానంలో కొనసాగుతుండడం గమనార్హం. అయితే అటు పేలవ ప్రదర్శన కొనసాగినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ సిక్సర్ల లో మాత్రం ఆకట్టుకుంది. ఏకంగా 94 సిక్సర్లతో మూడవ స్థానంలో ఉంది. ఆ తర్వాత 91 సిక్సర్లతో  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 89 సిక్సర్లతో కోల్కతా జట్టు 82 సిక్సర్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు  80 ఒక సిక్సర్లతో లక్నో 78 సిక్సర్లతో హైదరాబాద్ 77  సిక్సర్లతో ముంబై  58 సిక్సర్లతో గుజరాత్ వరుసగా ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl