ఐపీఎల్ లో ఈ రోజు కోల్కతా మరియు సన్ రైజర్స్ హైద్రాబాద్ జట్ల మధ్యన మ్యాచ్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ రెండు జట్లు ప్లే ఆప్స్ లోకి అడుగు పెట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ముందుగా టాస్ గెలిచిన కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విభిన్న రీతిలో బ్యాటింగ్ తీసుకున్నాడు. బహుశా ఛేజింగ్ చేసిన జట్లు వరుసగా ఓటమి చెందుతుండడమే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికను బట్టి చూస్తే సన్ రైజర్స్ మరియు కోల్కతా జట్లు వరుసగా ఏడు మరియు ఎనిమిది స్థానాలలో ఉన్నాయి. ఈ మ్యాచ్ తో కలిపి సన్ రైజర్స్ కు మూడు మరియు కోల్కతా కు రెండు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. కాబట్టి తమ శక్తి మేరకు ఆడి ప్లే ఆఫ్ కు చేరుకోవాలన్నదే ప్రస్తుత కర్తవ్యంగా మారింది. నెట్ రన్ రేట్ పరంగా చూస్తే కోల్కతా కన్నా సన్ రైజర్స్ కాస్త మెరుగ్గా ఉంది.

అయితే ఖచ్చితంగా అన్ని మ్యాచ్ లు గెలవాల్సిందే. అంత కన్నా ముందు ఈ మ్యాచ్ లో మొదట గెలవాలి. అయితే మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా టీమ్ మళ్ళీ తడబడింది. అయితే చివర్లో రస్సెల్ (49) ఎప్పటిలాగే విలువైన ఇన్నింగ్స్ తో ఆదుకోగా అతనికి బిల్లింగ్స్ (34) పరుగులతో చక్కని సహకారం అందించాడు. సన్ రైజర్స్ బౌలర్లు సమర్థవంతంగా బౌలింగ్ చేసి బాగా కట్టడి చేశారు. ముఖ్యంగా క్రికెట్ లో ఉసేన్ బోల్ట్ గా పేరు గాంచిన ఉమ్రాన్ మాలిక్ 3  వికెట్లతో చెరిగాడు. మొన్న బాగానే ఆడినట్లు కనిపించిన వెంకటేష్ అయ్యర్ ఈ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు.

ఇక రహానే, నితీష్ రానా లు ఆరంభాలు దక్కిన పెద్ద స్కోర్ చేయలేక చతికిలబడ్డారు. రింకు సింగ్ మరియు శ్రేయాస్ అయ్యర్ ఫెయిల్ అయ్యారు. అలా చివరికి కోల్కతా 177 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను ముగించింది. ఇక సన్ రైజర్స్ ఆటగాళ్లు ఈ స్కోర్ ను ఛేదిస్తారా ? లేదా శ్రేయస్ సేన  ఈ స్కోర్ ను డిపెండ్ చేస్తుందా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: