ఐపిఎల్ లో ఈ రోజు మరో కీలక మ్యాచ్ ముగిసింది. ఇక మిగిలిన కొన్ని మ్యాచ్ లు గుజరాత్, ముంబై మరియు చెన్నై సూపర్ కింగ్స్ లకు తప్పించి మిగిలిన 7 టీమ్ లకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకంటే... గుజరాత్ ఆల్రెడీ ప్లే ఆప్స్ కు చేరింది... ఇక ముంబై చెన్నైలు దారుణమైన ఆటతీరును కనబరిచి ప్లే ఆఫ్ రేస్ నుండి దూరం అయ్యారు. దీనితో ప్రతి ఒక్క మ్యాచ్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందుకే ఈ మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది.. అయితే కీలక సమయంలో తడబడే అలవాటున్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి కోల్కతా విసిరిన లక్ష్యాన్ని చేధించలేక ఓటమిని మూటగట్టుకుంది.

కోల్కతా నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో టీమ్ అంతా సమిష్టిగా విఫలం అయింది. దీనితో సన్ రైజర్స్ మ్యాచ్ ఓడిపోవడంతో పాటుగా రన్ రేట్ కూడా  దారుణంగా కోల్పోయింది. ప్రస్తుతం సన్ రైజర్స్ 12 మ్యాచ్ లలో 5 గెలిచి 10 పాయింట్లతో 8 వ స్థానంలో ఉంది. ఇక నెట్ రన్ రేట్ చూసుకుంటే -౦.270 కు చేరుకుంది. అలా కోలకతా సన్ రైజర్స్ పై 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.  ఈ విజయంతో కోల్కతా ఆడిన 13 మ్యాచ్ లలో 6 గెలిచి 12 పాయింట్ లతో ఏకంగా ఆరవ స్థానానికి చేరుకుంది. అంతే కాకుండా తమ రన్ రేట్ +0.160 ను కూడా మెరుగు పరుచుకుంది.

ఇప్పుడు కోలకతా పంజాబ్ కన్నా మెరుగ్గా ఉంది. కానీ పంజాబ్ ఖాతాలో 10 పాయింట్లు మరియు రెండు ఆడాల్సిన మ్యాచ్ లు ఉన్నాయి. ఇక ప్లే ఆఫ్ రేస్ మరీ ఇంటరెస్టింగ్ గా మారింది. కోల్కతా తన ఆఖరి మ్యాచ్ లో భారీ తేడాతో గెలిస్తే ప్లే ఆఫ్ రేస్ లో ఉంటుంది. మరి చూద్దాం ఏమి జరుగుతుందో...?

మరింత సమాచారం తెలుసుకోండి: