ఇటీవలే ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ అకాల మృతి తో అటు అభిమానులు అందరూ కూడా దిగ్భ్రాంతిలో మునిగి పోయారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికి ఆస్ట్రేలియా క్రీడా లోకం మొత్తం ఇప్పటికీ షేన్ వార్న్ మృతి నుంచి తేరుకోలేక పోతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే షేన్ వార్న్ అకాల మరణం షాక్ నుంచి బయటపడుతున్న క్రికెట్ ప్రేక్షకులందరికీ ఇక ఇప్పుడు మరో చేదు వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు మాజీ ఆల్రౌండర్ ఆండ్రూ సైమండ్స్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.


 టౌన్సవిల్లె లో జరిగిన కార్ యాక్సిడెంట్ లో ఆండ్రూ సైమండ్స్ ప్రాణాలు కోల్పోయాడు అన్నది తెలుస్తుంది. దీంతో ఇక సైమండ్స్ మృతిపై అటు ఆస్ట్రేలియా క్రీడా లోకం మొత్తం ప్రస్తుతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఆండ్రూ సైమండ్స్ మృతి పట్ల పలువురు ప్రముఖులు మాజీ ఆటగాళ్లు క్రీడా అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. రాత్రి పదిన్నర గంటల సమయంలో నగరానికి పశ్చిమాన 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హీర్వి రేంజ్ లో ప్రమాదం జరిగిందని అక్కడి పోలీసులు చెబుతున్నారు. అతి వేగం కారణంగా కారు బోల్తా కొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.



  పోలీసులు ఆండ్రూ సైమండ్స్ ను వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు శాయశక్తులా ప్రయత్నించినప్పటి కీ సైమండ్స్  ని మాత్రం రక్షించ లేక పోయారు అని చెప్పాలి. కాగా క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఆండ్రూ సైమండ్స్ సుపరిచితుడు అని చెప్పాలి. ఆయన పేరు వినగానే జడలు వేసినట్టుగా ఉండే జూలపల జుట్టు తెల్లటి పెదాలతో భారీ దేహం కళ్ళముందు కదులుతూనే ఉంటుంది. ఆస్ట్రేలియా గెలిచిన మూడు వరల్డ్ కప్ లలో  కూడా ఆండ్రూ సైమండ్స్ కొనసాగాడు. 1998లో పాకిస్థాన్ పై వన్డేలో అరంగేట్రం చేసిన ఆండ్రూ సైమండ్స్
 2012 అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: