అటు భారత క్రికెట్లో అంబటి రాయుడు తర్వాత చాలా ఏళ్ళకి అటు హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్ అవకాశం దక్కించుకున్నాడు. ఇక ఆ తర్వాత యువ ఆటగాళ్లకు సరైన అవకాశాలు దక్కడం లేదు అని అనుకుంటున్న సమయంలో ఇటీవలే తెలంగాణ ప్లేయర్ తిలక్ వర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అవకాశం దక్కించుకున్నాడు అనే విషయం తెలిసిందే. ఏకంగా ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు అతని కొనుగోలు చేయడంతో అందరి చూపు అతని వైపు మళ్ళింది. దీంతో తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ తరఫున ఎలా రాణించ పోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.


 అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో వచ్చిన అవకాశాన్ని ఎంతో బాగా సద్వినియోగం చేసుకున్న తిలక్ వర్మ .. ప్రతి మ్యాచ్లో కూడా భారీగా పనులు చేస్తూ సత్తా చాటాడు. ఒకవైపు ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా ఓటమి పాలు అవుతూ ఉన్నప్పటికీ తిలక్ వర్మ లో మాత్రం ఎలాంటి ఒత్తిడి కనిపించలేదు. బ్యాటింగ్ కి రావడం మంచి పరుగులు చేయడం.. ఇక జట్టుకు భారీ స్కోరు అందించడమే లక్ష్యంగా ప్రతి మ్యాచ్లో అతను ఆడాడు. ఈ క్రమంలోనే ఇటీవల తిలక్ వర్మ అరుదైన రికార్డు సాధించాడు అనే చెప్పాలి.  ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన మేనేజర్ గా తిలక్ వర్మ రికార్డు నెలకొల్పాడు.


 2017 ఐపీఎల్ సీజన్ లో రిషబ్ పంత్ 14 మ్యాచ్లలో 366 పరుగులు చేసి ఐపీఎల్ లో ఎక్కువ పరుగులు చేసిన టీనేజర్ గా రికార్డు సృష్టిస్తే ఇక ఇప్పుడు ఆ రికార్డును తిరగరాశాడు తిలక్ వర్మ. కేవలం 12 మ్యాచ్ లలోనే 368 పరుగులు చేసి రిషబ్ పంత్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ఆ తర్వాత పృథ్వీషా 16 మ్యాచ్ లలో 353 పరుగులు సంజూ శాంసన్ పదమూడు మ్యాచ్ లలో 339 పరుగులను కూడా అధిగమించాడు తిలక్ వర్మ . కాగా ఇటీవలే అతని ప్రతిభకు ఫిదా ఆయన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అతను టీమిండియా మూడు ఫార్మాట్లకు తప్పక ఆడతాడు అంటూ ధీమా వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: