ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్ మృతితో ప్రస్తుతం క్రికెట్ లోకం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఇక  సైమండ్స్ మృతి పై ఎంతో మంది క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. ఇక ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆండ్రూ సైమండ్స్ ఆస్ట్రేలియా జట్టు తరఫున చేసిన సేవలను గుర్తు చేసుకుంది. ఇటీవలే తన ఇంటికి సమీపంలో కారులో వెళుతున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగగా.. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై మరణించారు ఆండ్రూ సైమండ్స్. దీంతో ఆయన అభిమానులు అందరూ కూడా దిగ్భ్రాంతిలో మునిగి పోయారు.


 ఇక ఇలాంటి సమయంలోనే ఆండ్రూ సైమండ్స్ కు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతున్నాయ్. 1998లో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ప్రారంభించిన ఆండ్రూ సైమండ్స్ 2009 వరకు మొత్తం 26 టెస్టులు ఆడాడు. ఇక 198 వన్డేలు ఆడాడు ఆండ్రూ సైమండ్స్.  ఆస్ట్రేలియా జట్టు తరఫున అద్భుత ఆల్రౌండర్గా ముద్రవేసుకున్నాడు. ఆస్ట్రేలియా గెలిచిన మూడు వరల్డ్ కప్ లో కూడా సభ్యుడిగా ఉన్నాడు ఆండ్రూ సైమండ్స్. 2012 లో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.


అయితే క్రికెట్లో కొన్నిసార్లు ఆటగాళ్ళ మధ్య చిన్నపాటి వివాదం నెలకొనడంతో సర్వసాధారణం. ఇలాగే  సైమండ్స్, హార్భజన్ సింగ్ మధ్య కూడా ఒక వివాదం ఉంది. సిడ్నీలో 2008లో ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఈ క్రమంలోనే రెండో అంతస్తులో ఆండ్రూ సైమండ్స్ ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మధ్య వివాదం తలెత్తింది. హర్భజన్ సింగ్ తనను మంకీ అన్నాడు అంటూ  సైమండ్స్ ఆరోపించాడు. అయితే తాను మంకీ అనలేదని మా..కి అన్నానని హర్భజన్ సింగ్ వివరణ ఇచ్చాడు. అయినప్పటికీ హర్బజన్ దే తప్పు అంటూ ఆసీస్ క్రికెట్ బోర్డు అతని పై మూడు మ్యాచ్లు నిషేధం విధించింది. నిషేధం ఎత్తివేయక పోతే టూర్ క్యాన్సిల్ చేసుకుంటామంటూ అప్పటి కెప్టెన్ అనిల్ కుంబ్లే చెప్పడంతో చివరికి వెనక్కి తగ్గింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు..

మరింత సమాచారం తెలుసుకోండి: