ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఆస్ట్రేలియా క్రికెట్ లో దిగ్గజ క్రికెటర్ గా కొనసాగుతున్న మాజీ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్ హఠాత్ మరణం చెందారు. ఇటీవలే కారులో ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం బారిన పడిన ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే   పరిస్థితి విషమించడంతో చివరికి ప్రాణాలు వదిలారు. క్వీన్స్ ల్యాండ్ లోనే టౌన్స్ విళ్ళే లో గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్ఘటన జరగడం గమనార్హం. ఈ క్రమంలోనే ప్రస్తుతం క్రికెట్ ప్రేక్షకులందరూ ఆండ్రూ సైమండ్స్  మృతి పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


 మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అకాల మరణంతో విషాదంలో మునిగి పోయిన అభిమానులు ఇక ఇప్పుడు ఆండ్రూ సైమండ్స్ మృతితో మరింత షాక్ లో మునిగి పోయారు అని చెప్పాలి.  ఇక ఈ క్రమంలోనే ఎంతో మంది క్రికెటర్లు ప్రపంచవ్యాప్తంగా ఆండ్రూ సైమండ్స్ మృతిపై సంతాపం తెలియజేస్తున్నారు. కాగా 1998లో పాకిస్తాన్ పై జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు సైమండ్స్.


 2012లో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఆండ్రూ సైమండ్స్ అటు ఐపీఎల్ లో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆండ్రూ సైమండ్స్ ఐపీఎల్ కెరియర్ దక్కన్ చార్జెస్ హైదరాబాద్ జట్టు ద్వారానే ప్రారంభమైంది. మూడు సీజన్ల పాటు హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు  సైమండ్స్. ఇక ఆ తర్వాత జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ అతని దక్కించుకోవడం గమనార్హం. ఇక ఇలా రెండు జట్ల తరపున ఐపీఎల్లో 974 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ 5 అర్ద సెంచరీలు ఉండటం గమనార్హం. అయితే ఐపీఎల్ లో తనకు భారీ ధర పలకడంతో మైకేల్ క్లార్క్ తో తన స్నేహం చెడిపోయింది అంటూ ఇటీవల కామెంట్ చేసాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: