చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ఐపీఎల్ ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయి నిష్క్రమించింది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మ్యాచ్ లూ ఆడుతున్న అది కేవలం నామమాత్రం మాత్రమే.. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శనపై అభిమానులు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న అంబటి రాయుడు ఏకంగా ఇటీవలే తన కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఒక పోస్ట్ పెట్టి అభిమానులందరికీ షాక్ ఇచ్చాడు.


ఈ క్రమం లోనే అభిమానులు అందరూ కూడా ఒక్క సారిగా షాక్ లో మునిగి పోయారు. నిమిషాల వ్యవధి లోనే గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఏకంగా అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు పెట్టిన పోస్టుని డిలీట్ చేశాడు. ఇక ఆ తర్వాత అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించడం లేదని చెన్నై సూపర్ కింగ్స్ తో కలిసి ఉంటాడని జట్టు యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. ఇక ఇలాంటి సమయంలో ఇటీవల గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో అంబటి రాయుడు కనిపించకపోవడం తో అభిమానులు అందరూ కూడా ఆందోళన చెందారు. ఈ క్రమం లో అసలేం జరిగిందో అర్థం కాక అయోమయంలో మునిగిపోయారు.


 ఈ క్రమంలోనే మాట్లాడిన మహేంద్రసింగ్ ధోని క్లారిటీ ఇచ్చాడు. నామమాత్రపు మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ కోసం జట్టు లో భారీ మార్పులు చేసినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జట్టులో సీనియర్ లూగా కొనసాగుతున్న రాబిన్‌ ఊతప్ప, అంబటి రాయుడు, డ్వేన్‌ బ్రావో, మహీశ్‌ తీక్షణలను బెంచ్‌కు పరిమితం చేసినట్లు తెలిపాడు. యువ ఆటగాళ్లు ఎన్‌ జగదీషన్‌, ప్రశాంత్‌ సోలంకీ, మతీష పతిరన, మిచెల్‌ సాంట్నర్‌లను అవకాశం కల్పించినట్లు తెలిపాడు. దీంతో అంబటి రాయుడుని ఎందుకు జట్టులోకి తీసుకోలేదు అన్న విషయంపై క్లారిటీ రావడంతో అభిమానులు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: