ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ప్రతి ఏడాది ఎంతో మంది యువ ఆటగాళ్లు ప్రతిభతో తెరమీదికి వస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అద్భుతమైన ఆట తీరుతో అదరగొడుతు ఉంటారు. అంతేకాదు ఇక టీమిండియాలో చోటు దక్కించుకోవడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ముంబై ఇండియన్స్ జట్లు తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ తెర మీదికి వచ్చాడు. ఒక వైపు ముంబై జట్టు వరుస ఓటమి పాలు అయినప్పటికీ తిలక్ వర్మ మాత్రం ప్రతి మ్యాచ్ లోనూ మంచి ప్రదర్శన చేసి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు.


 అచ్చంగా ఇలాగే అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పేలవ ప్రదర్శనతో ఏడాది అభిమానులందరినీ కూడా నిరాశ పరిచినప్పటికీ ఆ జట్టులో ఎంట్రీ ఇచ్చిన యువ పేసర్ ముఖేష్ చౌదరి, సమర్జిత్ సింగ్ మాత్రం మంచి ప్రదర్శన తో ఆకట్టుకున్నారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పవర్ ప్లే లో వికెట్లు తీయడంలో ఇద్దరు బౌలర్లు సక్సెస్ అయ్యారు. కీలక సమయంలో వికెట్లు పడగొట్టి చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో  తమ వంతు పాత్ర వహించారు అని చెప్పాలి.  ఇకపోతే ఇద్దరు యువ ఫేసర్ లపై ప్రస్తుతం మాజీ క్రికెటర్లూ ప్రశంసలు కురిపిస్తున్నారు.


 ఈ క్రమంలోనే చెన్నై జట్టు తరపున ఇద్దరు ఫేసర్లూ మంచి ప్రదర్శన చేయడం పై స్పందించిన టీమిండియా మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్ గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు భారత జట్టులోకి వస్తారని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో ముఖేష్ చౌదరి సమర్జీత్ సింగ్ పర్వాలేదనిపించారు. ముఖేష్ చౌదరి పవర్ ప్లే లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇక సమర్జీత్ కూడా తన బౌలింగ్లో మరింత మెరుగు పడ్డాడు. ఇక వచ్చే ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ లో ఇద్దరూ ఎంతో బలమైన ఫేస్ ధలంగా మారుతారు అంటూ దీప్ దాస్ గుప్తా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: