ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా హార్థిక్ పాండ్యా కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ జట్టు దుమ్మురేపుతోంది అన్న విషయం తెలిసిందే. వరుస విజయాలతో ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యాన్ని సాధిస్తోంది.  అంతేకాకుండా ఏడాది ప్లే ఆప్ కి అర్హత సాధించిన మొట్టమొదటి జట్టుగా కూడా రికార్డు సృష్టించింది గుజరాత్  జట్టు. ఇక ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగుతున్న ఇరవై పాయింట్లతో  ఎవరికి అందనంత ఎత్తులో ఉంది గుజరాత్ జట్టు.


 అయితే గతంలో పాము కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మాత్రం పర్వాలేదు అనిపిస్తున్నాడు. ఎక్కడ 3 లేదా 4 వ నెంబర్ లో బ్యాటింగ్కు దిగుతూ బాగానే పరుగులు తీస్తున్నాడు. 12 మ్యాచ్ లలో 351 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్థసెంచరీ ఉండటం గమనార్హం.  కానీ గత కొన్ని మ్యాచ్ ల నుంచి మాత్రం హార్దిక్ పాండ్యా ప్రదర్శన సంతృప్తి కరంగా లేదు అన్నది ప్రస్తుతం ఒక చర్చ తెరమీదికి వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఏడు పరుగులకే  వికెట్ కోల్పోయాడు.


 అంతేకాకుండా గత ఆరు మ్యాచ్ లలో తలకువ పరుగులు మాత్రమే చేశాడు. ఇక మూడు లేదా నాలుగు నెంబర్లు బ్యాటింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా జట్టుకు మంచి స్కోరు అందించాల్సింది పోయి విఫలం అవుతూనే ఉన్నాడు. అదే సమయంలో గత ఆరు మ్యాచ్ లలో కేవలం హార్థిక్ పాండే మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయడం గమనార్హం. దీంతో అతని ఫిట్నెస్ పై ప్రస్తుతం మళ్లీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాగా రాణిస్తున్న హార్దిక్ పాండ్యా టీమిండియాలో చోటు దక్కించుకుంటాడు అనుకుంటే ఇక ఇప్పుడు మళ్ళి బౌలింగ్ కు దూరమవడంతో అతనికి టీమిండియాలో చోటు దక్కుతుందా లేదా అన్న చర్చ మాత్రం తీవ్రంగా జరుగుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl