ఏడాది పేలవ ప్రదర్శనతో ఇప్పటికి ఐపీఎల్   మొదటి నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కుంటున్న చెన్నై సూపర్ కింగ్స్ లో ఇటీవలే అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి అనే విషయం తెలిసిందే. జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ఆ తర్వాతఓటమిని చవి చూడటం. తర్వాత  జడేజా కెప్టెన్సి ధోనీకి అప్పగించడం జరిగింది. ఇకపోతే ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగిన అంబటి రాయుడు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది.


 ఇదే నా చివరి టీ20 లీగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు అంబటి రాయుడు. దీంతో అంబటి రాయుడుకు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి ఎక్కడో తేడా జరిగింది అన్న వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే ఆ తర్వాత ఊహించని ట్విస్ట్ ఇచ్చిన అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు పెట్టిన పోస్టుని డిలీట్ చేశాడు. అటు వెంటనే అంబటి రాయుడు గురించి మాట్లాడిన చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ విశ్వనాధ్ కాశి అశోక్ ఎం కామెంట్స్ చేశాడు


 అంబటి రాయుడు రిటైర్మెంట్ తీసుకోవడం లేదని చెన్నై సూపర్ కింగ్స్ తోనే కలిసి వుంటాడు అంటు క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్ సైతం ఈ వ్యవహారం పై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో మాత్రం అంబటి రాయుడు జట్టులో చోటు దక్కలేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా జట్టులో రాయుడు లేకపోవడం  అభిమానులందరినీ కూడా నిరాశ పరిచింది. అయితే మొన్నటి వరకు బెంచికి పరిమితమైన యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు సీనియర్లను పక్కన పెట్టినట్లు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని చెప్పుకొచ్చాడు.


 అయినప్పటికీ అటు అంబటి రాయుడు కి చెన్నై సూపర్ కింగ్స్ కి మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి మాత్రం ఆగలేదు అని చెప్పాలి ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. గుజరాత్ మ్యాచ్లో రాయుడు లేకపోవడం ఏమి నిరుత్సాహానికి గురి చేయలేదు.. అయితే ఇప్పుడు వస్తున్న ఆరోపణలన్నీ కూడా టీ కప్పులో తుఫాను లాంటిది. రాయుడు బాగానే ఉన్నాడు. ఇలాంటి చర్చ మా క్యాంపు పై ఎలాంటి ప్రభావం చూపబోదని. నేను చెప్పింది ఏమి స్టోరీ కాదు అంతా బాగానే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు స్టిఫిన్ ఫ్లెమింగ్..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl