ఈ రోజు ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్యన కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో ఇరు జట్లకు రెండు మ్యాచ్ లు మాత్రం మిగిలి ఉన్నాయి. ప్లే ఆఫ్ పై ఆశలు పెట్టుకోవాలంటే ఈ మ్యాచ్ లో గెలిచి తీరాలి. అప్పుడే తర్వాత మ్యాచ్ గురించి ఆలోచన. లేదంటే ముంబై చెన్నై లలాగే ఈ రోజు డిసైడ్ అయిపోతుంది. ఇప్పటికే హార్దిక్ పాండ్య కెప్టెన్ గా ఉన్న గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ కు చేరుకోగా, అనధికారికముగా లక్నో ప్లే ఆఫ్ కు చేరినట్లే లెక్క. ప్రస్తుతం ఢిల్లీ మరియు పంజాబ్ జట్లు పాయింట్ల పట్టికలో 5 మరియు ఏడవ స్థానంలో ఉన్నారు.

టాస్ గెలిచిన పంజాబ్ ఫిల్డింగ్ ఎంచుకుంది. ఇక ఢిల్లీ ఇన్నింగ్స్ ను వార్నర్ మరియు సర్ఫరాజ్ ఖాన్ లు ఆరంభించారు. కానీ వార్నర్ ఆడిన తొలి బంతికే అవుట్ అయ్యాడు. ఇది ఢిల్లీ యాజమాన్యాన్ని ఎంతగానో నిరాశ పరిచింది. అయితే మరో ఓపెనర్ సర్ఫరాజ్ ఖాన్ కాసేపు పంజాబ్ ను ఉరకలెత్తించాడు. అయితే ఈసారి అర్ష్ దీప్ సింగ్ ఒక తెలివైన బంతితో సర్ఫరాజ్ ను అవుట్ చేశాడు. కానీ సర్ఫరాజ్ కేవలం 16 బంతుల్లో 32 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోర్ ను అందించాడు. ఇప్పుడు మార్ష్ మరియు లలిత్ యాదవ్ లు మెల్లగా ఇన్నింగ్స్ ను బిల్డ్ చేయడానికి ఆడుతున్నారు.

గత మ్యాచ్ లో లాగా ఈ రోజు కూడా మార్ష్ కనుక చెలరేగితే ఢిల్లీ కి మరో విజయాన్ని అందించగలదు. ఈ మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మార్ష్ ఆడడం చాలా అవసరం. పంజాబ్ కు బ్యాటింగ్ బలంగా ఉంది. 200 లోపు స్కోర్ ను ఛేజింగ్ చేయగల సామర్ధ్యం వారిలో ఉంది. కాబట్టి భారీ స్కోర్ ను సాధించాలి.  మరి చూద్దాం మార్ష్ మరో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడతాడా లేదా ?

మరింత సమాచారం తెలుసుకోండి: