డేవిడ్ వార్నర్.. ఈ పేరు చెబితే చాలు బౌలర్ల వెన్నులో వణుకు పుడుతుంది అని చెప్పాలి. ఎందుకంటే వార్నర్ ఒక్కసారి క్రీజులోకి వచ్చాడు అంటే బౌలర్ల పై విజృంభిస్తూ ఫోర్లు సిక్సర్లతో చెలరేగి పోతు ఉంటాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా డేవిడ్ వార్నర్ పరుగుల వరద పారిస్తూ ఉంటాడు. ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ఓపెనర్ గా ఎప్పుడూ భారీ ఓపెనింగ్స్ అంధించి జట్టు విజయాల్లో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు డేవిడ్ వార్నర్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా భారత క్రికెట్ ప్రేక్షకులకి కూడా ఎంతగానో దగ్గరయ్యాడు అన్న విషయం తెలిసిందే.


 మొదట ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతోనే తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు డేవిడ్ వార్నర్. ఇక ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ లో కి వెళ్ళాడు. ఇక హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా మారి ఎంతో సమర్థవంతంగా జట్టును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే అటు తెలుగు క్రికెట్ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు. హైదరాబాద్ జట్టు ఎంత పేలవ ప్రదర్శన చేస్తున్న ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఈ ఏడాది మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కి వెళ్ళాడు అన్న విషయం తెలిసిందే.


 ఇకపోతే ఇటీవలె ఢిల్లీ కాపిటల్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ బాగా రాణిస్తాడు అనుకుంటే గోల్డెన్ డక్ ఔట్ గా పెవిలియన్ చేరాడు. దీంతో సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. 2013 మే 16వ తేదీన పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన డేవిడ్ వార్నర్ సందీప్ శర్మ బౌలింగ్లో తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఇక ఇప్పుడు మే 16వ తేదీన అదే పంజాబ్ జట్టుపై గోల్డెన్ డక్ ఔట్ కావడం గమనార్హం. కాగా ఇప్పటివరకు టి-20లో మూడుసార్లు మాత్రమే డకౌట్  గా వెనుదిరిగాడు డేవిడ్ వార్నర్.

మరింత సమాచారం తెలుసుకోండి: