ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ జట్టు లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ కూడా తప్పుకోవడంతో ఇక పంజాబ్ కి కొత్త కెప్టెన్గా మయాంక్ అగర్వాల్ ఎన్నికయ్యాడు. ఈ క్రమంలోనే  ఒక్కసారైనా ఐపీఎల్లో టైటిల్ గెలిచి తీరుతుంది అని అభిమానుల్లో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మయాంక్ అగర్వాల్ తో పాటు పంజాబ్ కింగ్స్ జట్టు కి అదృష్టం కలిసివస్తుందని అనుకున్నారు. కానీఈ ఏడాది కూడా అదే పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ అభిమానులందరినీ కూడా తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తుంది పంజాబ్ కింగ్స్ జట్టు.


 ఒక మ్యాచ్ లో మంచి విజయాన్ని సాధించింది అనుకునేలోపు ఆ తర్వాత రెండు మ్యాచ్లలో పరాజయం పాలవుతు నిరాశ పరుస్తూనే ఉంది. ఇలా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది పంజాబ్ కింగ్స్ జట్టు  ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 17పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ప్లే ఆఫ్ నుంచి పంజాబ్కింగ్స్ దాదాపు నిష్క్రమించింది. అయితే పంజాబ్ కింగ్స్ జట్టులో కీలక బౌలర్ గా కొనసాగుతున్న రబడా తో అటు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఎందుకో నాలుగు ఓవర్లు కోటను పూర్తి చేయలేదు. ఇది అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.


 ఇటీవల ఇదే విషయంపై స్పందించిన మాజీ ఆటగాడు ఆకాష్ చొప్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్లో మూడు ఓవర్లు వేసి ఒక వికెట్ పడగొట్టాడు కగిసో రబాడా. అతడు ఒక డెత్ స్పెషలిస్ట్ బౌలర్ అన్న విషయం అందరికీ తెలుసు. అలాంటి ఆటగాడితో ఎందుకు పూర్తి కోట ఓవర్లు వేయించ లేదు. మయాంక్ అగర్వాల్ ఏం కెప్టెన్సీ  చేస్తున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. పిచ్ కొద్దిగా టర్న్ అవుతుంది ఆ సమయంలో లివింగ్స్టన్ తీసుకురావడం సరైన నిర్ణయమే. రబాడా తో  తన ఆఖరి ఓవర్ వేయించి ఉంటే బాగుండేది అంటూ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: