ఒక మ్యాచ్ లో మంచి విజయాన్ని సాధించింది అనుకునేలోపు ఆ తర్వాత రెండు మ్యాచ్లలో పరాజయం పాలవుతు నిరాశ పరుస్తూనే ఉంది. ఇలా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది పంజాబ్ కింగ్స్ జట్టు ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 17పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ప్లే ఆఫ్ నుంచి పంజాబ్కింగ్స్ దాదాపు నిష్క్రమించింది. అయితే పంజాబ్ కింగ్స్ జట్టులో కీలక బౌలర్ గా కొనసాగుతున్న రబడా తో అటు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఎందుకో నాలుగు ఓవర్లు కోటను పూర్తి చేయలేదు. ఇది అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇటీవల ఇదే విషయంపై స్పందించిన మాజీ ఆటగాడు ఆకాష్ చొప్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్లో మూడు ఓవర్లు వేసి ఒక వికెట్ పడగొట్టాడు కగిసో రబాడా. అతడు ఒక డెత్ స్పెషలిస్ట్ బౌలర్ అన్న విషయం అందరికీ తెలుసు. అలాంటి ఆటగాడితో ఎందుకు పూర్తి కోట ఓవర్లు వేయించ లేదు. మయాంక్ అగర్వాల్ ఏం కెప్టెన్సీ చేస్తున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. పిచ్ కొద్దిగా టర్న్ అవుతుంది ఆ సమయంలో లివింగ్స్టన్ తీసుకురావడం సరైన నిర్ణయమే. రబాడా తో తన ఆఖరి ఓవర్ వేయించి ఉంటే బాగుండేది అంటూ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు..