ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో పూర్తిస్థాయి ఆదిపత్యాన్ని సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్  రిషబ్ పంత్ వ్యవహారశైలిపై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయ్ అని చెప్పాలి.  పంత్ తీరు పై మాజీ క్రికెటర్లు ప్రస్తుతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ మ్యాచ్లో భాగంగా నిర్లక్ష్య మైన షాట్ ఆడటానికి ప్రయత్నించి రిషబ్ పంత్ వికెట్ చేజార్చుకున్నాడు.


 ఇన్నింగ్స్ లో 11 ఓవర్లలో లసిత్ యాదవ్ వికెట్ కోల్పోయిన తర్వాత క్రీజు లోకి వచ్చాడు కెప్టెన్ రిషబ్ పంత్. ఈ క్రమంలోనే పంత్ ఎదుర్కొన్న మొదటి బంతికే సింగిల్ తీశాడు. ఇక ఆ తర్వాత మళ్లీ స్ట్రైక్ లోకి వచ్చిన తర్వాత లివింగ్ స్టోన్ వేసిన బంతిని సిక్సర్ గా మలిచాడు.  ఇక తర్వాత బంతిని వేయడానికి సిద్ధమైన లివింగ్ స్టోన్ కొన్ని కారణాలవల్ల రన్ ఆఫ్ మధ్యలో ఆగిపోయాడు. అయితే రిషబ్ పంత్ ఆ బంతిని కొట్టడానికి క్రీజు బయటికి  వచ్చి ఆడటానికి సిద్ధమైనట్లు అనిపించింది. ఇది గమనించిన లివింగ్ స్టోన్ ఎంతో తెలివిగా తర్వాత బంతిని వైడ్ గా వేసాడు.చివరికి పంతు వికెట్ కోల్పోయాడు.


 అయితే రిషబ్ పంత్ ఇలా వికెట్ కోల్పోయిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్ మెన్స్ అందరూ కూడా వరుసగా పెవిలియన్ బాట పట్టారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని తీరు పై విమర్శలు వస్తున్నాయి. జట్టును ముందుండి నడిపించాల్సిన సమయంలో బాధ్యతారహితంగా ఆడిన రిషబ్ పంత్ ఓటమికి కారణం అయ్యాడు అంటూ విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా మాజీ బౌలర్ ఆర్పీ సింగ్ ఈ విషయంపై స్పందిస్తూ మ్యాచ్ గెలవడం కంటే నీకు ఈగో ముఖ్యమా అంటూ ప్రశ్నించాడు. అప్పటికే పంజాబ్ మ్యాచ్ పై పట్టు బిగిస్తోంది. వరుసగా  వికెట్లు పడుతున్నా సమయంలో పంత్ మరింత బాధ్యతగా ఆడాల్సింది. లివింగ్ స్టోన్ అతన్ని  ట్రాప్ చేశాడు. పంత్ ట్రాప్ లో పడిపోయాడు. చివరికి రిషబ్ పంత్ ఇగో పై లివింగ్ స్టోన్  విజయం సాధించాడు అంటు ఆర్పీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: