సంవత్సరానికి ఒకసారి వచ్చే ఐపీఎల్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. తమ తమ ఫేవరెట్ టీం లు బాగా ఆది టైటిల్ గెలవాలని ఆసిస్తూ ఉంటారు. కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న టీమ్ దారుణంగా ఫెయిల్ అయితే..కనీసం ప్లే ఆఫ్ దశకు కూడా చేరుకోకుంటే సదరు అభిమాని ఎంతగా ఫీల్ అవుతారో వేరే చెప్పక్కర్లేదు. ఈ ఐపీఎల్ లో కూడా తెలుగు ప్రజలు ఎంతగానో ఆరాధించే సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ దాదాపుగా ప్లే ఆప్స్ కు దూరమైనట్లే అని తెలుస్తోంది. గత ఐపీఎల్ లో ఎదురైన దారుణ పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటుందని అంతా ఆశించారు. కానీ ఇక్కడ అంతా తలక్రిందులు అయింది.

ఐపీఎల్ ఆరంభమే సరిగ్గా లేదు.. వరుసగా రెండు మ్యాచ్ లలో ఓటమై తెచ్చుకుంది. ఆ తరువాత పుంజుకుని వరుసగా అయిదు మ్యాచ్ లు గెలిచి అందరికీ హడల్ పుట్టించింది. ఇక అప్పటి నుండి వరుసగా ఓటములే స్వాగతం పలుకుతున్నాయి. అయితే ఈ అయిదు మ్యాచ్ లలో కనీసం 2 గెలిచి ఉన్నా ఇప్పుడు ప్లే ఆప్స్ లో సన్ రైజర్స్ ఖచ్చితంగా ఉండేది. కానీ ఎందుకు ఇంతలా ఫెయిల్ అయింది అంటే క్రికెట్ విశ్లేషకులు ఒక్క విషయం చెబుతున్నారు. ఏ టీమ్ అయినా గెలవడానికి ఓపెనర్లు రాణించడం చాలా అవసరం.. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఉన్నా ఓపెనర్లు అభిషేక్ శర్మ మరియు కెప్టెన్ విలియమ్సన్.

అభిషేక్ శర్మ ఒక మ్యాచ్ లో కాకపోయినా మరో మ్యాచ్ లో రాణిస్తున్నాడు. కానీ కెప్టెన్ గా ఉన్న విలియం సొన్ మాత్రం దారుణమైన ప్రదర్శనను కనబరిచాడు. ఇప్పటి వరకు విలియమ్సన్ ఆడిన 13 మ్యాచ్ లలో కేవలం ఒక్క అర్ద సెంచరీ చేసి హైద్రాబాద్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. సన్ రైజర్స్ ఈ స్థితిలో ఉంది అంటే దానికి 100 శాతం విలియం సన్ కారణం అంటూ నెటిజన్లు అంటున్నారు. ఇక ఈ తరహా ప్రదర్శనతో నెక్స్ట్ ఐపీఎల్ లో విలియం సన్ ను కెప్టెన్ గా కొనసాగించడం కష్టమే.  

మరింత సమాచారం తెలుసుకోండి: