ఈ రోజు ఐపీఎల్ లో ఇప్పటికే ప్లే ఆప్స్ కు దూరమైన ముంబై ఇండియన్స్ మరియు రేపో మాపో ప్లే ఆప్స్ కు దూరం కానున్న సన్ రైజర్స్ హైద్రాబాద్ ఆడుతున్నారు. అయితే ఇద్దరూ ఫలితం ఉపయోగపడని మ్యాచ్ ఆడుతున్నారు. ఇది జస్ట్ ముంబై కి మాత్రం మరీ దారుణమైన ఔటింగ్ లేకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది గెలిస్తే, ఇక సన్ రైజర్స్ గెలిస్తే కనీసం పాయింట్ల పట్టికలో పదిలమైన స్థానం పొందగలదు అంతే. అయితే ఆడాల్సిన మ్యాచ్ లు అన్నీ వదిలేసి.. నామమాత్రపు మ్యాచ్ లో మాత్రం సన్ రైజర్స్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్ ను చూసిన సన్ రైజర్స్ అభిమానులు తలలు పీక్కుంటూ ఉంటారు.

ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ముంబై ఎప్పటిలాగే ఫిల్డింగ్ ఎంచుకుంది. అయితే సన్ రైజర్స్ ఈ సారి కొంచెం స్ట్రాటజీని మార్చింది. ఓపెనర్ గా విలియం సన్ రాకుండా యువ ఆటగాడు ప్రియం గార్గ్ కు ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ ను ఆడించాడు. దొరికిన ఈ అవకాశాన్ని అతను రెంచు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. ఆ తర్వాత షో అంతా రాహుల్ త్రిపాఠి (76) మరియు పూరన్ (38) లదే.. బౌలర్ ఎవరనేది కూడా చూడకుండా ఇద్దరూ దంచి కొట్టారు. అలా సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్ లలో ౧౯౩ పరుగుల భారీ స్కోర్ చేసింది.

అయితే ఈ స్కోర్ ను ముంబై ఛేదిస్తుందా అన్నది ఇప్పుడు సందేహంగానే ఉంది. ఎందుకంటే సన్ రైజర్స్ లాంటి బుల్లెట్ లాంటి బౌలింగ్ అటాక్ ను ఎదుర్కొని.. 194 పరుగులు చేయడం కొంచెం సవాలుతో కూడుకున్న విషయమే. అయితే ముంబై కు సంచలనాలు సృష్టించడం కొత్త కాదు అని చెప్పాలి. మరి చూద్దాం ముంబై గెలిచి ఈ రాత్రికే సన్ రైజర్స్ ను ప్లే ఆప్స్ కు దూరం చేస్తుందా లేదా?

మరింత సమాచారం తెలుసుకోండి: