ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ప్రతి మ్యాచ్ ఎంతో రసవత్తరంగా మారిపోయింది. ఇప్పటికే ప్లేఆఫ్ రేసులో ముందున్న గుజరాత్ టైటాన్స్ జట్టు 20 పాయింట్లతో ప్లే ఆఫ్ లో తన బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. ఈ క్రమంలోనే మిగిలిన మూడు స్థానాల కోసం ప్రస్తుతం ఏడు జట్లు పోటీ పడుతూ ఉండడం గమనార్హం. ఇప్పటికే ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఇక ఐపీఎల్ నుంచి నిష్క్రమించాయ్.


 కాగా ప్రస్తుతం పోటీపడుతున్న ఏడు జట్లలో మొదటి మూడు స్థానాల్లో నిలిచే జట్లు ఏవి అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే ఐపీఎల్ లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గత ఎన్నో జట్లకి ప్లే అవకాశాలు గల్లంతు అయ్యేవి. కానీ ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చివరికి ఓటమి చవిచూసింది. దాదాపు వరుసగా ఐదు పరాజయాలతో సతమవుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పుడు విజయఢంకా మోగించింది.



 అయితే సన్రైజర్స్ విజయం సాధించడం వెనక క్రెడిట్ మొత్తం సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కి వెళ్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు నిర్ధేశించిన టార్గెట్ చేయించడానికి ముంబై ఇండియన్స్ కి 12 బంతుల్లో 19 పరుగులు కావాలి. టి 20 లో ఇవి పెద్ద గణాంకాలు కాదు అనే చెప్పాలి  కానీ 19వ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ ఓ వికెట్ తీయడమే కాకుండా మెయిడిన్ వేశాడు. దీంతో చివరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సిన వచ్చింది. దీంతోముంబైకీ ఓటమి తప్పలేదు. సన్రైజర్స్ గెలిచింది అంటే కేవలం భువనేశ్వర్ కుమార్ కారణంగానే అంటూ ఎంతోమంది కామెంట్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl