ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఎంతో ప్రేక్షకాదరణ పొందిన జట్లలో అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా ఒకటి అని చెప్పాలి. గత ఏడాది వరకు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు.. ఇక ఈ ఏడాది మాత్రం డూప్లేసెస్ కెప్టెన్సీలో బరిలోకి దిగింది. నిలకడగా రాణిస్తోంది. ఈ క్రమంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున గత సీజన్లో ఎంతో అద్భుతమైన సేవలు చేసి ప్రేక్షకాదరణ పొందిన మాజీ క్రికెటర్లకు అరుదైన గౌరవం ఇవ్వాలని ఇటీవలే బెంగళూరు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది అని తెలుస్తోంది.



 ఈ క్రమంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక కార్యక్రమంలో హాల్ ఆఫ్ ఫేమ్ పరిచయం చేసింది. బెంగళూరు జట్టు తరఫున సేవలందించిన క్రికెటర్లకు ఇందులో స్థానం దక్కుతుంది. ఈ క్రమంలోనే  రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు హాల్ ఆఫ్ ఫేం జాబితాలో తొలి క్రికెటర్లుగా ఎబి డివిలియర్స్, క్రిస్ గేల్ నిలవడం  గమనార్హం. ఎన్నో ఏళ్ల పాటు  బెంగళూరు జట్టు తరఫున సేవలు అందించినందుకు కృతజ్ఞతగా వారిని హాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చినట్లు  జట్టు యాజమాన్యం ప్రకటించింది. అంతేకాదు దీనికి సంబంధించిన వీడియో ని కూడా  సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం.


 ఈ క్రమంలోనే ఇలా బెంగళూరు ఏర్పాటు చేసిన హాల్ ఆఫ్ ఫేం లో చోటు దక్కించుకున్న ఎబి డివిలియర్స్ క్రిస్ గేల్ లను బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుత కెప్టెన్ డుప్లెసిస్.. బెంగుళూరు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెసేన్ లూ అభినందిస్తూ స్పీచ్ లూ కూడా ఇవ్వడం ఈ వీడియోలో చూడవచ్చు.  అంతేకాకుండా వారందరికీ కూడా ఆన్లైన్ వేదికగానే వారి పేర్లతో పాటు జెర్సీ నెంబర్ ఉన్నా గోల్డ్ మెటల్ మెమెంటో తో సత్కరించడం గమనార్హం. బెంగుళూరు తరఫున డివిలియర్స్ 184 మ్యాచ్లు ఆడి 5182 పరుగులు చేశాడు ఇక క్రిస్ గేల్ 142 మ్యాచ్లు ఆడి 4925 పరుగులు సాధించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb