నిన్న జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. వాస్తవానికి ఈ మ్యాచ్ లో ముంబై ఫేవరేట్ గా ఉంది. సగం ఓవర్ లు ముగిసే సరికి సన్ రైజర్స్ ముంబై ని కట్టడి చేసినా... టిమ్ డేవిడ్ ఒక్కడే ఆకాశమే హద్దుగా చెలరేగి 18 ఓవర్ లో 4 సిక్సర్ ల సాయంతో మొత్తం 26 పరుగులు సాధించి ముంబై ను విజయానికి దగ్గర చేశాడు. కానీ అదే ఓవర్ ఆఖరి బంతికి లేని సింగిల్ కోసం ప్రయత్నించిన డేవిడ్ రన్ ఔట్ అయ్యాడు. అప్పటికి ముంబై రెండు ఓవర్ లలో 19 పరుగులు చేయాల్సి ఉంది. ఈ దశలో 19 ఓవర్ వేసిన భువి పరుగులు ఏమీ ఇవ్వకుండా ఒక వికెట్ తీసి ముంబై ఓటమిని ఖరారు చేశాడు.

ఆఖరి ఓవర్ లో రమణ దీప్ సింగ్ ఒక ఫోర్ సిక్స్ కొట్టినా జట్టును గెలిపించలేకపోయాడు. అలా గెలవాల్సిన ముంబై విభిన్న రీతిలో ఓటమి చెందింది. దీనితో  ముంబై ఆడిన 13 మ్యాచ్ లలో 10 ఓటములను మూటగట్టుకుంది. ఇక మిగిలిన ఆఖరి మ్యాచ్ లో అయినా గెలిచి టోర్నీని విజయంతో ముగిస్తుందా లేదా అన్నది తెలియాలంటే 21 వ తేదీ వరకు వేచి చూడాలి. ఇది ఇలా ఉంటే... ముంబై మొదటి వికెట్ కు 95 పరుగులు జోడించినా ఓటమి చెందడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ సీజన్ లో ఒక నాణ్యమైన ఫినిషర్ ను ముంబై పట్టుకోలేకపోయింది. రోహిత్ ఇషాన్ లు సీజన్ ఆసాంతం సరైన భాగస్వామ్యం ఇవ్వలేక ఫెయిల్ అయ్యారు. ఇక వన్ డౌన్ లోనచిన సూర్య, తిలక్ వర్మ లు కొన్ని మ్యాచ్ లలో పరుగులు చేసినా జట్టును గెలిపించడానికి అవి సరిపోలేదు. ఇక లోయర్ ఆర్డర్ లో ఆడాల్సిన పొలార్డ్  కూడా ఈ సారి తీవ్రంగా ఫెయిల్ అయ్యాడు.

అయితే వీరి స్క్వాడ్ లో టిమ్ డేవిడ్ రూపంలో మంచి హిట్టర్ మరియు బౌలర్ ఉన్నాడు. ఇతనిని మొదట్లో ఒకటి రెండు మ్యాచ్ లు ఆడించి ఆ తర్వాత నుండి బెంచ్ కే పరిమితం చేశారు. కేవలం ఒకటి రెండు మ్యాచ్ లలో తన సత్తాను నిరూపించుకునే అవకాశం రాలేదు. అయితే మళ్లీ కొనసాగించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. అతను ఎంత మంచి హిట్టర్  అనేది గత మ్యాచ్ లో చూస్తే అర్థమవుతుంది. నటరాజన్ బౌలింగ్ లో 6 బంతుల్లో నాలుగు సిక్సర్ లు కొట్టడం సాధారణ విషయం కాదు. అందులోనూ హ్యాట్రిక్  సిక్సర్ లు ఉండడం గమనార్హం. మరి టిమ్ డేవిడ్ ను అన్ని మ్యాచ్ లలో ఆడించి ఉంటే ముంబై చివరి ఓవర్ లలో ఓడిన మ్యాచ్ లు అన్నీ గెలిచేది, తద్వారా ప్లే ఆఫ్ కు చేరే ఛాన్స్ ఉండేది.. మరి ముంబై ఇండియన్స్ చేసిన ఈ పెద్ద తప్పిదం వలన దారుణంగా టోర్నీ నుండి నిష్క్రమించాల్సిన పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: