ప్రస్తుతం ఇండియాలో ఎండలు ఎంతలా దంచికొడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఉదయం నుంచి కాలు బయట పెట్టాలి అంటేనే భయపడిపోతున్నారు జనాలు. అధికారులు కూడా ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దు అంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. కేవలం అత్యవసరం అయితేనే బయటకు రావాలి అని సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో అటు ఐపీఎల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది.


 సమ్మర్ సీజన్లో దంచికొడుతున్న ఎండల్లో అందరూ బయటకు రావడానికి భయపడుతుంటే అటు ఐపీఎల్లో ఆటగాళ్లు ఎలా ప్రాక్టీస్  చేస్తున్నారు అని డౌట్ రావచ్చు. ఎండ వేడిమి లో ప్రాక్టీస్ చేస్తూ ఆటగాళ్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్న దానికి నిదర్శనంగా ఇప్పుడు ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. ఈ ఏడాది ఐపీఎల్ మొత్తం ముంబై-పూణే వేదికగా జరుగుతూ ఉంది. ఇక సముద్రం ఒడ్డున ఉన్న ప్రాంతాలు కావడంతో మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఇక్కడ ఎండలు మరింత ఎక్కువగానే ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ సమయంలో ఎండలతో ఆటగాళ్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు.


 ఇటీవల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆల్రౌండర్ మాక్స్వెల్ ఎండ వేడిమికి తట్టుకోలేక  తన వెంట తెచ్చుకున్న కంటైనర్ లో ఇక తలపెట్టి నీళ్లతో తడుపుతున్నాడు.  ఇక ఈ ఎండలకు మాక్స్ వెల్  ఒక్క సారిగా షాక్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోని బెంగళూరు జట్టు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ వీడియో చూసిన తర్వాత ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ఐపీఎల్ లో ప్రాక్టీస్ చేస్తూ ఆటగాళ్లు ఎలా ఇబ్బంది పడుతున్నారు అన్నది అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అనే చెప్పాలి. కేవలం ఒక్క మాక్స్వెల్ పరిస్థితి మాత్రమే కాదు మిగతా ఆటగాళ్ల పరిస్థితి ఇలాగే ఉండి ఉంటుందని అనుకుంటున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl