ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆణిముత్యాలకు కొదవ లేదు అనే చెప్పాలి. ప్రతి ఏడాది ఎంతో మంది ప్రతిభ కలిగిన యువ ఆటగాళ్లు తెర మీదికి రావడం తమలో దాగివున్న సత్తా ఏంటో నిరూపించి.. ఇక అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో కూడా ఎప్పటిలాగానే ఎంతో మంది యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు అని చెప్పాలి. అంతర్జాతీయ క్రికెట్ లో ఎంతో అనుభవం ఉన్న సీనియర్ ఆటగాళ్లు పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తూ ఉంటే యువ ఆటగాళ్లు మాత్రం అదరగొడుతున్నారు.



 ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో యువ ఆటగాళ్లు హాట్ ఫేవరెట్గా మారిపోయారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా అద్భుతంగా రాణిస్తున్న వారి లో తిలక్ వర్మ, ఆయుష్ బాదోని, రింకు సింగ్, శశాంక్ సింగ్ సహా తదితర ఆటగాళ్లు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కొంతమంది బ్యాట్ తో మరి కొంతమంది బాల్ తో ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే సన్రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో మరో ఆణిముత్యం తెరమీదికి వచ్చాడు. అతని పేరు రమణ దీప్ సింగ్ సన్రైజర్స్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తూ తన ప్రతిభతో ఆకట్టుకున్నాడు.


 ఫలితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో మూడు ఓవర్లు వేసిన రమన్ దీప్ సింగ్ ఏకంగా 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేకాదండోయ్ కీలకమైన మూడు వికెట్లు పడగొట్టడం గమనార్హం. సిక్సర్లు ఫోర్లు తో విరుచుకుపడుతున్న ప్రియమ్ గార్గ్, రాహుల్ త్రిపాటి సహా మార్కరమ్ లను కూడా పెవిలియన్ పంపించాడు రమణ దీప్ సింగ్. దీంతో అందరి దృష్టి అతని పైకి వచ్చేసింది. అతని వివరాల్లోకి వెళితే.. 1997 డిసెంబర్ 13 చండీగఢ్ లో జన్మించిన రమణ దీప్ సింగ్ ఫిబ్రవరి 12, 2020 పంజాబ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు. 2019 లో  లిస్ట్  ఏ.. 2017 లో టి-20 లో ఆరంగేట్రం చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రెండు మ్యాచ్ లూ ఆడి 124 పరుగులు,  లిస్ట్ ఏ క్రికెట్లో 10 మ్యాచుల్లో 141 పరుగులు తో పాటు ఒక వికెట్ తీశాడు. 16 టి20 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి 116 పరుగులు చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: