సాధారణంగా ఉత్కంఠభరితంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న  సమయంలో అటు ఆటగాళ్లందరూ కూడా ఎంతో అగ్రెసివ్ గానే ఉంటారు అన్న విషయం తెలిసిందే. చిన్న పొరపాటు జరిగినా కాస్త కోపంగానే రియాక్ట్ అవుతుంటారు. కొన్నిసార్లు ఇక ప్రత్యర్ధులపై ప్రతీకారం తీర్చుకునే సమయంలో చిత్రవిచిత్రంగా సెలబ్రేషన్స్ చేసుకోవడం కూడా చూస్తూ ఉంటాం అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే రాజస్థాన్ లక్నో మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో రాజస్థాన్ యువ ఆటగాడు రియాన్ పరాగ్ ఒక క్యాచ్  పట్టిన సమయంలో చేసుకున్న సెలబ్రేషన్స్ కాస్త అందరినీ అవాక్కయ్యేలా చేశాయ్ అని చెప్పాలి.


 ఇక రియాన్ పరాగ్ వింత సెలబ్రేషన్స్ చేసుకోవడంపై అటు మాజీ క్రికెటర్లు కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెదవి విరుస్తున్నారు. ఇటీవల ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హేడెన్ స్పందించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే లక్నోలో జరిగిన మ్యాచ్లో స్టోయినిస్ క్యాచ్ లు పట్టిన తర్వాత రియాన్ పరాగ్ సంబరాలు చేసుకున్నాడు. అయితే మొదట క్యాచ్ పట్టిన సమయంలో రిప్లై లో నాటౌట్ గా తేలింది. అదే ఇన్నింగ్స్ చివరి ఓవర్లో మరోసారి స్టోయినిస్ కొట్టిన బంతి గాలిలో లేవగా..  క్యాచ్ అందుకున్నాడు.


 ఈ క్రమంలోనే ఈసారి తాను పట్టిన బంతి నేలకు తాకలేదు అంటూ విచిత్రమైన  హావభావాలు చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. దీనిపై స్పందించిన మాథ్యూ హేడెన్  యువ క్రికెటర్ కు కొన్ని సూచనలు ఇస్తూన్న అంటు తెలిపాడు. క్రికెట్ అనేది ఎంతో సుదీర్ఘమైన గేమ్. ఎన్నో జ్ఞాపకాలను పొందుపరుచుకుంటాం. అందుకే విధిని ఎప్పుడూ ప్రలోభ పెట్టకూడదు. ఎందుకంటే ఏదైనా మనం చేస్తే మళ్ళీ తిరిగి ఎప్పుడో ఒకసారి అది మనకే తగులుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. స్టోయినిస్ కాష్ పట్టిన తర్వాత రియాన్ పరాగ్ సంబరాలు చేసుకునే విధానం సరైంది కాదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: