ఈ ఏడాది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్రాన్ మాలిక్ ఎంత అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి మ్యాచ్లో కూడా బుల్లెట్ వేగంతో బంతులను విసురుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతని ప్రతిభకు అటు మాజీ క్రికెటర్లు కూడా ఫిదా అయిపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఉమ్రాన్ మాలిక్ ను వెంటనే టీమిండియా లోకి తీసుకోవాలంటూ డిమాండ్ కూడా ఎక్కువైపోతున్నాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే   ఉమ్రాన్ టీమిండియాకు కూడా తానె ఫ్యూచర్ స్టార్ అంటూ నిరూపిస్తూ ఉన్నాడు.


 ఇకపోతే ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మధ్య ఆసక్తికరంగా జరిగింది అన్న విషయం తెలిసిందే. చివరి ఓవర్ వరకు ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో ఐదు పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఇదే మ్యాచ్లో అటు హైదరాబాద్ జట్టులో ఫాస్ట్ బౌలర్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న ఉమ్రాన్ మాలిక్ అరుదైన  ఘనత సాధించాడు అని చెప్పాలి. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 20 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన అతి పిన్న భారతీయ బౌలర్గా రికార్డు సృష్టించాడు.


 ఈ రికార్డు  ముందుగా ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రిత్ బూమ్రా పేరిట ఉండేది. 2017లో ఐపీఎల్ సీజన్ లో  23 ఏళ్ళ 165 రోజుల వయసులో బుమ్రా రికార్డు సాధించాడు. ఇప్పుడు ఉమ్రాన్ మాలిక్ 22 ఏళ్ళ 175 రోజులలో ఈ అరుదైన రికార్డు కొట్టాడు.  ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఉమ్రాన్  13 మ్యాచ్ లలోనే 21 వికెట్లు పడగొట్టి అదరగొట్టడం గమనార్హం. ఇక వీరిద్దరి కంటే ముందు ఆర్పీ సింగ్ 23 ఏళ్ల నూట అరవై ఆరు రోజుల వయసులో ప్రజ్ఞాన్ ఓజా 23 ఏళ్ల 222 రోజుల వయసులో ఈ ఘనత సాధించడం గమనార్హం. ఈ క్రమంలోనే ఉమ్రాన్ మాలిక్ అభిమానులూ అందరు కూడా ఎంతగానో మురిసిపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl