ఈ రోజు జరగనున్న మ్యాచ్ చాలా ఉత్కంఠగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ లో లక్నో మరియు కోల్కతా జట్లు గెలవడం కోసమే ఆడనున్నాయి. అయితే అంత తేలిగ్గా ఏ జట్టూ లోంగిపోదు అని తెలుస్తోంది. ప్రస్తుతం లక్నో జట్టు 16 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. ఇక కోల్కతా మాత్రం ఆరవ స్థానంలో కొనసాగుతోంది. ఒక ఈ మ్యాచ్ లో గెలిచి టాప్ 2 లో ఉండాలని ఆశిస్తోంది. ఇక కోల్కతా ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ కు ఏమైనా ఛాన్స్ ఉందేమో ఉన్న భావనలో ఉంది. అనుకున్నట్లుగానే లక్నో టాస్ గెలిచింది. మరి మ్యాచ్ ఎవరు గెలుస్తారో అన్నది ఇంకాసేపట్లో తెలియాల్సి ఉంది.

ఇరు జట్లలోనూ ఒక్కొక్కరు మొదటి మ్యాచ్ ఆడనున్నారు... కోల్కతా నుండి అభిజిత్ తోమర్ మరియు లక్నో నుండి మనన్ వోహ్రా లు ఈ రోజు బరిలోకి దిగుతున్నారు. ఇక లక్నో జట్టులో ఈ రోజు ముగ్గురు ప్లేయర్లు బెంచ్ కి పరిమితం కానున్నారు. క్రునాల్ పాండ్య గాయం కారణంగా తప్పుకోగా, ఆయుష్ బదోని మరియు చమీరా లపై సరైన ప్రదర్శన లేని కారణంగా తప్పించారు. వారికి బదులుగా గౌతమ్, లూయిస్ మరియు మనన్ వోహ్రా లు జట్టులోకి వచ్చారు. అయితే లక్నో కీలక మ్యాచ్ లో ప్రయోగం చేయడం ఎంత వరకు సబబు అన్నది తెలియాల్సి ఉంది.

అయితే ఆయుష్ బదోని మరియు చమీరా లు లేకపోవడం పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ క్రునాల్ పాండ్య ఒక ఆల్ రౌండర్ గా జట్టుకు బాగా ఉపయోగపడుతాడు. బ్యాటింగ్ లో ప్రభావం చూపకపోతున్నప్పటికీ కీలక సమయంలో వికెట్లు తీస్తూ జట్టు విజయాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. మరి కీలకమైన ఈ మ్యాచ్ లో ఒకేసారి మూడు మార్పులు చేసి ప్రయోగం చేస్తున్న రాహుల్ ధీమా ఏమిటన్నది ఇంకాసేపట్లో తేలనుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: