ఈ ఏడాది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పడుతూ లేస్తూనె ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది అద్భుతంగా రాణిస్తుంది  అనుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమి తోనే ఐపీఎల్ ప్రస్థానాన్ని ప్రారంభించింది. వరుసగా రెండు ఓటముల తర్వాత  పుంజుకున్న సన్రైజర్స్ జట్టు ఐదు విజయాలు సాధించింది. అభిమానులందరూ ఇక ఈ సారి సన్రైజర్స్ కప్పు కొట్టడం ఖాయం అనుకున్నారు. ఆ తర్వాత వరుసగా ఐదు పరాజయాలు చవిచూసిన సన్రైజర్స్ జట్టు అభిమానులందరినీ కూడా నిరాశ పరిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ నుంచి నిష్క్రమించినట్లే అని అందరూ అనుకుంటున్న సమయంలో ఇటీవలే ముంబై ఇండియన్స్ పై గెలుపుతో ప్లే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.


 ఇక తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన సమయంలో ఇప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ కు ఊహించని షాక్ తగిలింది అని తెలుస్తుంది. ఇన్ని రోజుల వరకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన కేన్ విలియమ్సన్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే స్వదేశానికి బయలుదేరాడు కేన్ విలియమ్సన్. కేన్ విలియమ్సన్  సతీమణి సారా రహీం రెండో బిడ్డకు జన్మనివ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బయో బబుల్ వీడి ఇక స్వదేశానికి పయనం అయ్యాడు కేన్ విలియమ్సన్  ఈ క్రమంలోనే 22వ తేదీన పంజాబ్కింగ్స్ తో జరిగే కీలకమైన మ్యాచ్ కు దూరం అయ్యాడు అని తెలుస్తోంది.


 కేన్ విలియమ్సన్ స్వదేశానికి వెళ్లడంతో ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సి ఎవరు చేపట్టబోతున్నారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ లేదా నికోలస్ పూరన్ ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ గా మారి ముందుకు నడిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేన్ విలియంసన్  స్వదేశానికి బయల్దేరాడు అన్న విషయాన్ని ఇటీవలే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా కేన్ విలియంసన్ దంపతులకు 2020లో ఒక అమ్మాయి జన్మించిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా వెస్టిండీస్ పర్యటన నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు కేన్ విలియమ్సన్..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl