సాధారణంగా టీ20 ఫార్మాట్ అంటే బ్యాట్ మెన్ లది ఆదిపత్యం  కొనసాగుతూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు. బౌలర్ల పై విరుచుకుపడుతూ వరుస బౌండరీలతో రెచ్చిపోతూ బ్యాట్స్మెన్ స్కోర్ బోర్డు ని పరుగులు పట్టించడం అటు టీ20 ఫార్మాట్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్న విషయం తెలిసిందే. ఇలా మైదానంలో బ్యాట్స్మెన్లు సిక్సర్లతో విరుచుకుపడుతూ ఉంటే టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులు ఎంతగానో సంబరపడిపోతూ ఉంటారు.  టి-20 ఫార్మెట్లో బ్యాట్స్ మెన్ లది ఆధిపత్యం కొనసాగుతోంది అన్న దానికి నిదర్శనంగా ఇక ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో క్వింటన్ డికాక్ విధ్వంసం సృష్టించాడు.



 సెంచరీ సాధించిన ఇంకా పరుగుల దాహం తీరలేదు అన్నట్లుగా కోల్కతా బౌలర్లపై వీరవిహారం చేసాడు క్వింటన్ డికాక్. బౌలర్ ఎవరు అన్నది కూడా చూడకుండా ప్రతి బంతిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా పెట్టుకుని విలయ తాండవం చేశాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా ఇటీవల కోల్కత నైట్రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో ఓపెనర్ క్వింటన్ డీకాక్ సెంచరీ తో చెలరేగాడు. కేవలం 70 బంతుల్లోనే 140 పరుగులు సాధించాడు అంటే ఇక క్వింటన్ డీకాక్ సృష్టించిన విధ్వంసం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  ఇక తన ఇన్నింగ్స్ లో పది ఫోర్లు 10 సిక్సర్లు కూడా ఉండటం గమనార్హం.


 కాగా క్వింటన్ డికాక్ ఐపీఎల్ కెరియర్ లో ఇది రెండవ సెంచరీ కావడం గమనార్హం. 2016 ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడిన క్వింటన్ డికాక్ ఐపీఎల్ లో తన తొలి సెంచరీ నమోదు చేశాడు. ఇక అదే విధంగా ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన 3 వ ఆటగాడిగా కూడా క్వింటన్ డీకాక్ నిలవడం గమనార్హం. అంతకుముందు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 175 పరుగులు, బ్రెండన్ మెకల్లమ్ 158 పరుగుల వ్యక్తిగత స్కోరు తో వరసగా రెండు స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు 140 పరుగులతో మూడవ స్థానం లోకి వచ్చేశాడు క్వింటన్ డికాక్..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl