ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ప్రతి జట్టు ప్రస్తుతం ప్లే ఆఫ్ లో అడుగు పెట్టడానికే మ్యాచ్ ఆడుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో అటు ప్లే ఆఫ్ లో అడుగుపెట్టిన మొట్టమొదటి జట్టుగా గుజరాత్ టైటాన్స్ జట్టు రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే మిగిలిన మూడు స్థానాల్లో ఏ జట్లు భర్తీ చేయబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. కాగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా మారిపోయిన నేపథ్యంలో ప్రేక్షకులందరూ టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ వీక్షిస్తున్నారు అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్ కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఓపెనర్లు క్వింటన్ డికాక్,కేఎల్ రాహుల్ ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేశారూ. పదిహేనేళ్ల ఐపీఎల్ హిస్టరీ లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్ జోడీగా సరికొత్త రికార్డును సృష్టించాడు అని చెప్పాలి. ఇటీవలే కోల్కతా నైట్రైడర్స్ మ్యాచ్ లో సందర్భంగా వీరిద్దరూ కలిసి 210 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.


 క్వింటన్ డీకాక్ 70 బంతుల్లోనే 140 పరుగులతో వీరవిహారం చేస్తే ఇక కె.ఎల్.రాహుల్ 51 బంతుల్లో 68 పరుగులు చేసి క్వింటన్ డికాక్ కు మంచి మద్దతు అందించాడు అన్నది తెలుస్తుంది. అంతకుముందు విరాట్ కోహ్లీ దేవదత్త పడిక్కాల్ చేసిన 181 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం అత్యధికంగా కొనసాగుతుంది. ఇటీవల క్వింటన్ డికాక్ కె.ఎల్.రాహుల్ ఇద్దరు ఓపెనర్లు కూడా ఈ రికార్డును బద్దలు కొట్టారూ అని చెప్పాలి. ఓవరాల్గా ఐపీఎల్ హిస్టరీ లోనే ఏ వికెట్ కైనా సరే ఇది మూడవ అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించిన లక్నో ప్లే ఆఫ్ లో అడుగుపెట్టింది..

మరింత సమాచారం తెలుసుకోండి: