జస్ప్రిత్ బూమ్రా.. భారత జట్టులో కీలక బౌలర్ గా కొనసాగుతున్నాడు. బౌలింగ్ విభాగాన్ని ముందుకు నడిపించే సీనియర్గా ఉన్నాడు. అంతేకాదు టీమిండియాలో డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా జస్ప్రిత్ బూమ్రా సత్తా చాటుతున్నాడు అని చెప్పాలి. ఎన్నో ఏళ్ల నుంచి టీమిండియాలో సక్సెస్ఫుల్గా రాణిస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు జస్ప్రిత్ బుమ్రా. అంతేకాకుండా ఇక  బౌలింగ్లో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను ముప్పుతిప్పలు పెట్టడంలో జస్ప్రిత్ బూమ్రా తర్వాత ఎవరైనా అని చెప్పాలి. బుల్లెట్ వేగంతో బంతులను విసురుతూ కీలక సమయంలో వికెట్లు పడగోడుతూ ఉంటాడు.


 ఈ క్రమంలోనే ఇక టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇటీవలే టి20 ఫార్మాట్లో ఒక అరుదైన రికార్డును నెలకొల్పాడు అనే చెప్పాలి. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టులో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ముంబై ఇండియన్స్ లో కూడా కీలక బౌలర్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేస్తూ ఉన్నాడు. ఒకవైపు జట్టు పేలవ ప్రదర్శనతో వరుస ఓటములు చవిచూస్తున్న అటు జస్ప్రిత్ బూమ్రా మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల అరుదైన రికార్డ్ అందుకున్నాడు జస్ప్రిత్ బూమ్రా.



 అటు అంతర్జాతీయ టి20లో ఇటు భారత టీ20 క్రికెట్ లో కలిపి మొత్తం 250 వికెట్లు పడగొట్టాడు. ఇక టీ-20 ఫార్మెట్లో ఈ ఘనత సాధించిన ఏకైక  భారత క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్లో బూమ్రా చివరి బంతికి వాషింగ్టన్ సుందర్ ని బౌల్డ్ చేశాడు. దీంతో ఇక పొట్టి ఫార్మర్ గా పిలుచుకునే టీ20 క్రికెట్ లో ఏకంగా 250 వికెట్ల ఫీట్ పూర్తిచేసుకున్నాడు బూమ్రా. ఇక హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 223 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతూ ఉండడం గమనార్హం. ఇక ఇదే లిస్టులో జయదేవ్ ఉనాద్ఘాట్ 201 మాజీ పేసర్ వినయ్ కుమార్ 194 వికెట్లు సాధించి వరుసగా మూడు నాలుగు స్థానాల్లో ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: