ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోరు మరింత రసవత్తరంగా మారిపోయింది. ప్రస్తుతం ఐపీఎల్ లో భాగంగా లీగ్ దశ ముగింపుకు రావడంతో ఇక ప్రతి మ్యాచ్ కూడా ఎంతో హోరాహోరీగానే జరుగుతుంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ లాంటి ఛాంపియన్ జట్లు ఐపీఎల్ నుంచి నిష్క్రమించాయ్. మరోవైపు కోల్కతా నైట్రైడర్స్ జట్టు కూడా ఇటీవలే లక్నో చేతిలో ఓడిపోయి ఇంటి బాట పట్టింది.


 ఇలాంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, 4సార్లు కప్పు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, రెండుసార్లు టైటిల్ను ఎగరేసుకుపోయినా కోల్కతా ప్రస్తుతం పోటీలో లేకపోవడంతో ఇక ఈ సారి కొత్త జట్టు ఛాంపియన్ గా అవతరించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. కాగా నేడు ఐపీఎల్ లో భాగంగా మరో ఆసక్తికర పోరు జరగబోతుంది. గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నేడు సాయంత్రం ఏడున్నర గంటలకు మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటికే ప్లే అప్ లో చోటు దక్కించుకుంది గుజరాత్.


 అదే సమయంలో ఇక ప్లే అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే బెంగుళూరుకు చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. దీంతో ఎవరు పైచేయి సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ గుజరాత్ ఈ మ్యాచ్ లో గెలిస్తే ఒకే సీజన్లో అత్యధిక మ్యాచులు గెలిచిన జట్టుగా రికార్డు సృష్టిస్తుంది. అదే సమయంలో ప్లే అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే గుజరాత్ భారీ తేడాతో విజయం సాధించాల్సిన అవసరం ఉంది. దీంతో ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది  ప్రేక్షకుల్లో కూడా ఉత్కంఠ పెరిగి పోతుంది అని చెప్పాలి. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ చేరాలి అంటే ఒకవైపు గుజరాత్ జట్టుపై భారీ పరుగుల తేడాతో విజయం సాధించడంతో పాటు మరోవైపు ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగబోయే మ్యాచ్లో ఢిల్లీ ఓడిపోవాల్సి ఉంటుంది. ఇది జరిగితేనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ లో అడుగుపెడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl