ఇటీవలే ఐపీఎల్ లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్  ఎంత ఉత్కంఠ రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన నేపథ్యం లో సన్రైజర్స్ మ్యాచ్ మ్యాచ్ గెలిచినా ఓడినా పెద్దగా తేడా ఉండదు. కానీ సన్రైజర్స్ కి మాత్రం ప్లే అవకాశాలను సజీవం గా ఉంచు కోవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యం లోనే మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితం గా మారి పోయింది.


 అయితే చివరి వరకూ ముంబై ఇండియన్స్ వైపు ఉన్న మ్యాచ్ ను అటు హైదరాబాద్ ఫేసర్ భువనేశ్వర్ కుమార్ సన్ రైజర్స్ వైపు తిప్పాడు అన్న విషయం తెలిసిందే. ఒక రకం గా చెప్పాలంటే ముంబై ఇండియన్స్ పై సన్రైజర్స్ విజయం సాధించడానికి భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బౌలింగ్ కారణం అని చెప్పాలి. నాలుగు ఓవర్లు వేసిన భువనేశ్వర్ కుమార్ 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ముఖ్యం గా 19 ఓవర్లలో వికెట్ తీయడమే కాదు మెయిడెడ్  ఓవర్ వేసి సన్రైజర్స్ ను విజయ తీరాల వైపు నడిపించాడు.


 ఈ క్రమం లోనే ఇదే విషయం పై మాట్లాడినా భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డెత్ ఓవర్ల లో ఎంతో కూల్గా ఉండాలి అంటూ చెప్పుకొచ్చాడు. అలాంటి సమయం లో ఒక బౌండరీ వెళ్లిన ఒత్తిడిలో కూరుకు పోతూ ఉండటం సహజం.. అయితే అప్పుడే మనం మరింత కామ్ గా ఉండాలి ఒత్తిడిని జయిస్తే కామ్ గా ఉండాలి.. అలా ఉన్నప్పుడే ప్రణాళికలను పక్కాగా అమలు చేయగలమూ అంటు సన్రైజర్స్ హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ చెప్పుకొచ్చాడు. తన సహచర ఆటగాడు అయినా ఉమ్రాన్ మాలిక్ కు ఈమేరకు సలహా ఇచ్చాడు భువనేశ్వర్ కుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: