ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోరు ప్రస్తుతం మరింత ఉత్కంఠభరితంగా మారిపోయింది. ఇప్పటికే లీగ్ దశలో దాదాపు ముగింపు దశ చేరుకుంది. కాగా గుజరాత్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇప్పటివరకు ప్లే ఆఫ్లో అవకాశం దక్కించుకున్న జట్లు గా రికార్డు సృష్టించాయ్. ఈ క్రమంలోనే మిగిలిన రెండు స్థానాల కోసం దాదాపు ఐదు జట్లు పోటీ పడుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఎప్పుడు ఏ బ్యాట్స్మెన్ విజృంభిస్తాడు అన్నది కూడా ఊహించని విధంగానే ఉంది.


 సాధారణంగా ఇక టి20 ఫార్మాట్ గురించి క్రికెట్ విశ్లేషకుల ఒక మాట చెబుతూ ఉంటారు. 20 ఓవర్ లలో లో 15 ఓవర్ల వరకు మ్యాచ్ ఒక ఎత్తు  చివరి 5 ఓవర్లలో మరో ఎత్తు అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే డెత్ ఓవర్లూ గా పిలుచుకునే చివరి 5 ఓవర్లు  మ్యాచ్ స్వరూపం  మార్చేందుకు అవకాశం ఉంటుంది అంటూ ఉంటారు. ఎందుకంటే అప్పటివరకూ ఆచితూచి ఆడిన బ్యాట్స్ మెన్లు అందరు చివరి 5 ఓవర్లులో విజృంభిస్తూ సిక్సర్ 4 ఫోర్లతో చెలరేగిపోతారు.  ఈ క్రమంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఇక చివరి ఐదు ఓవర్ లలో అత్యధిక పరుగులు చేసిన జట్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


 2016 ఐపీఎల్ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గుజరాత్ లైన్స్ తో జరిగిన మ్యాచ్ లో చివరి 5 ఓవర్లలో ఏకంగా 111 పరుగులు చేసి ఎక్కువ పరుగులు చేసిన జట్టు గా మొదటి స్థానంలో కొనసాగుతోంది. 2019 ఐపీఎల్ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతా నైట్రైడర్స్ జట్టు పై చివరి ఐదు ఓవర్లలో 91 పరుగులు చేసింది. ఇక 2020 సంవత్సరం లోను బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్ పై చివరి ఐదు ఓవర్లలో 89 పరుగులు చేసింది. ఛాంపియన్ ముంబై ఇండియన్స్ పంజాబ్కింగ్స్ తో 2020 సీజన్  లో డెత్ ఓవర్లలో 89 పరుగుల చేసింది. ఇక లక్నో కోల్కత్తా మధ్య 2022 ఐపీఎల్ సీజన్ లో జరిగిన మ్యాచ్లో డెత్ ఓవర్ లో 88 పరుగులు చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl