ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఎంతో మంది యువ ఆటగాళ్లు తెర మీదికి వచ్చి తన అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఎన్నో రోజుల నుంచి ఐపీఎల్లో అవకాశం కోసం ఎదురు చూస్తున్న యువ ఆటగాళ్లు వచ్చిన అవకాశాన్ని ఎంతో అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఎంతోమంది యువ ఆటగాళ్లు తెర మీదికి వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. ఒకవైపు జట్లు వరుస ఓటముల పాలవుతున్న.. ఎక్కడ ఒత్తిడికి గురికాకుండా వరుస మంచి ప్రయత్నం చేయడం గమనార్హం.


 ఈ క్రమంలోనే కోల్కతా నైట్రైడర్స్ జట్టు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ ఆటగాడు రింకు సింగ్  తన ప్రదర్శనతో వీరోచిత పోరాటంతో అందరి మనసులను దోచుకున్నాడు అని చెప్పాలి. లక్నో, కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన కీలక మ్యాచ్లో చివరికి లక్నో విజయం సాధించి ప్లే ఆప్ లో అడుగు పెట్టింది. ఇక అటు లక్నో జట్టు కి ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది కోల్కతా నైట్ రైడర్స్. ఇక తీవ్ర స్థాయిలో నిరాశపరిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఈ క్రమంలోనే కోల్కతా నైట్రైడర్స్ జట్టు దాదాపు ఓటమి ఖరారు అయిపోయింది  అని అందరూ అనుకుంటున్న సమయంలో  కోల్కతా నైట్రైడర్స్ జట్టు తరపున  మంచి మంచి ప్రదర్శన కనబరుస్తున్న యువ ఆటగాడురింకు సింగ్ మెరుపు ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు అని చెప్పాలి. 14 బంతుల్లో నాలుగు సిక్సర్లు రెండు ఫోర్ లతో ఏకంగా 40 పరుగులు చేశాడు. జట్టు విజయానికి చేరువైన సమయంలో మరో భారీ షాక్ ప్రయత్నించి చివరికి ఔట్ అయ్యాడు. తర్వాత మైదానంలో భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ గెలవకపోయినా నీ ప్రదర్శనతో ప్రేక్షకుల మనసులు గెలిచావ్ అంటూ ప్రేక్షకుల ప్రశంసలు కురిపిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: