ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అభిమానుల అంచనాలు తారుమారయ్యాయి అనే విషయం తెలిసిందే. అద్భుతంగా రాణించి ఇక ఈ సారి టైటిల్ విజేత గా నిలుస్తారు అని అనుకున్న జట్లు ఏదో పేలవ ప్రదర్శన తో  పూర్తిగా నిరాశ పరిచాయ్. ముఖ్యం గా  ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్ర  లోనే ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న వారు సైతం వరుస ఓటముల తో సతమతమవుతూ తీవ్ర నిరాశ పరిచారు అని చెప్పాలి. ఈ క్రమం లోనే ఐదు సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ అటు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది.


 మొదటి నుండి  ఓటముల పరంపర కొనసాగించింది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా నిలిచింది.  ఇక ఆ తర్వాత నాలుగు సార్లు ఐపీయల్ టైటిల్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది అనే చెప్పాలి. జడేజా కెప్టెన్సీ చేపట్టిన.. ధోని చేతిలోకి కెప్టెన్సీ బాధ్యతలు వచ్చిన ఆ జట్టుకి అదృష్టం కలిసి రాలేదు  మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు సార్లు ఐపీయల్ టైటిల్ గెలుచుకున్న జట్టుగా కొనసాగుతోంది  కోల్కత నైట్రైడర్స్ జట్టు.


 ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా పడుతూ లేస్తూనే ప్రయాణాన్ని కొనసాగించింది కోల్కతా నైట్రైడర్స్. ఇటీవలే ముంబై ఇండియన్స్పై జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలవడం తో ఇంటి బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా  ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ లాంటి ఐపీఎల్ ఛాంపియన్ జట్లు గ్రూప్ దశలోనే ఎలిమినేట్ అయ్యాయ్. మొదటి సారి ఎక్కువ టైటిల్స్ సాధించిన జట్లు లేకుండానే ప్లే ఆఫ్ జరుగుతుండడం గమనార్హం. ఇలాంటి నేపథ్యంలోనే ఎంతో మంది క్రికెటర్లు అటు ఐపీఎల్ పై అంతగా ఆసక్తి కనబరచడం లేదు అనేది తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl