సాధారణంగా టి20 క్రికెట్ అంటేనే బ్యాట్స్మెన్ బ్లాక్బస్టర్ పర్ఫామెన్స్  కి మారుపేరు అన్న విషయం తెలిసిందే. ఒకసారి మైదానంలోకి దిగే బ్యాట్స్మెన్ విధ్వంసకర రీతిలో అటూ బౌలర్లపై విరుచుకుపడుతూ ఉంటారూ. ఈ క్రమంలోనే భారీగా పరుగులు తీస్తూ ఉంటారు. సిక్సర్ 4 ఫోర్లతో మైదానంలో ఉన్న ప్రేక్షకులందరినీ కూడా ఉర్రూతలూగిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఎంతో మంది ఆటగాళ్లు అదరగొడుతున్నారు అని చెప్పాలి.


 కాగా ఇలా ఇప్పటివరకు విధ్వంసక రీతిలో  భాగస్వామ్యంగా కాకుండా ఏకంగా వ్యక్తిగతంగా భారీ స్కోరు చేసిన ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చాలామంది ఉన్నారు అని చెప్పాలి. లక్నో కోల్కతాల మధ్య జరిగిన మ్యాచ్లో లక్నో ఓపెనర్ క్వింటన్ డికాక్ 70 బంతుల్లో 140 పరుగులు చేసి అదరగొట్టిన నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఎవరు వ్యక్తిగతంగా అత్యధిక స్కోరు చేశారు అన్న విషయం వెలుగులోకి వచ్చింది. మరి ఇప్పుడు వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు  తెలుసుకుందాం.


 యూనివర్సల్ బాస్ గా పేరు సంపాదించుకున్న క్రిస్ గేల్ ఇప్పటి వరకు దేశంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమయంలో 66 బంతుల్లో 175 పరుగులు చేశాడు. ఇప్పటివరకు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా కొనసాగుతోంది. మరోవైపు బ్రెండన్ మెకల్లమ్ కోల్కతా నైట్రైడర్స్ జట్టు తరపున 73 బంతుల్లో 153 పరుగులు చేశాడు. ఇక ఇటీవల జరిగిన మ్యాచ్లో క్వింటన్ డీకాక్ 70 బంతుల్లో 140 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ ఆర్సిబి తరుపున 59 బంతుల్లో 133 పరుగుల.. రియల్ రాహుల్  పంజాబ్ తరఫున 69 బంతుల్లో 132 పరుగులు తీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: