కేఎల్ రాహుల్.. ఇండియాలో ఎంతో అరుదైన ఆటగాడిగా కొనసాగుతోంది. మంచి టెక్నిక్ ఉన్న బ్యాట్స్మెన్గా ప్రస్తుతం పరుగుల వరద పారిస్తూ ఉన్నాడు. ఇక తన ఆటతీరు ప్రస్తుతం టీమిండియా లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అనే విషయం తెలిసిందే. టీమ్ ఇండియా లోని మూడు ఫార్మాట్లలో కూడా అదర గొడుతున్నాడు కె.ఎల్.రాహుల్. అయితే కేవలం భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో మాత్రమే కాదు అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా సత్తా చాటుతున్నారు అనే విషయం తెలిసిందే.


 మొన్నటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించాడు. జట్టులో ఉన్న ఆటగాళ్ళందరూ కూడా విఫలమవుతున్న కేఎల్ రాహుల్ మాత్రం పరుగుల వరద పారిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే జట్టుకు విజయం అందించడానికి ఎప్పుడూ ఒంటరి పోరాటం చేస్తూ ఉండేవాడు. కానీ పంజాబ్ కింగ్స్ అదృష్టం కలిసి రాలేదు. కానీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో లక్నో జట్టు తరపున ప్రాతినిధ్యం వహించడమే కాక కెప్టెన్గా కూడా మారిపోయాడు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ కు అటు మంచి మద్దతు  అందడంతో ఐపీఎల్ లో చిత్తక్కొడుతున్నాడు.


 అటు జట్టు మారిన కేఎల్ రాహుల్ ప్రదర్శన లో మాత్రం మార్పు రాలేదు అని చెప్పాలి.గత కొన్ని రోజుల నుంచి మెగా టోర్ని లో దుమ్ము రేపుతున్న కేఎల్ రాహుల్  ఒక అరుదైన రికార్డు సాధించాడు. వరుసగా ఐదు సీజన్ లలో  500కు పైగా పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2018 ఐపీఎల్ 659 పరుగులు, 2019లో 593, 2020లో 670, 2021లో 626 పరుగులు చేసిన రాహుల్ ఈ ఏడాది 2022 ఐపీఎల్ సీజన్ లో 534 పరుగులు చేశాడు  . కెప్టెన్సిలో కూడా ప్రతిభ చూపించి లక్నో జట్టును ప్లే ఆఫ్ కి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: