ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ప్రస్తుతం లీగ్ మ్యాచ్ లూ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ప్రతి మ్యాచ్ కూడా నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ప్రేక్షకులందరినీ  అందరిని ఉత్కంఠతో మునివేళ్ళపై నిలబెట్టేలా లక్నో, కోల్కతా మ్యాచ్ జరిగింది. అటు ప్లే అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే కోల్కతా తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. ఒక్క విజయం సాధిస్తే చాలు ప్లే ఆఫ్ లో  అడుగు పెడతామన్నా  ఆశ లక్నో జట్టుది. దీంతో చివరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో లక్నో లో రెండు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది


 ఫలితంగా అటు లక్నో జట్టు ప్లేఆఫ్ లో అడుగుపెట్టిన రెండవ జట్టు గా రికార్డు సృష్టిస్తే.. ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించిన జట్టుగా  కోల్కతా  జట్టు నిరాశలో మునిగిపోయింది. ఆఖరి బంతికి 3 పరుగులు చేయాల్సిన సమయంలో అద్భుతమైన బంతిని సందించిన స్టోయినిస్ ఉమేష్ యాదవ్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో లక్నో విజయం ఖరారైపోయింది. దీంతో ఇక లక్నో ఆటగాళ్లందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి. ఇక్కడ డగౌట్ లో ఉన్న లక్నో జట్టు మెంటార్ రాహుల్ ద్రావిడ్ అయితే ఈ విజయం తర్వాత తీవ్రమైన ఉద్వేగానికి లోనయ్యాడు.


 గట్టిగా గర్జిస్తూ గాల్లోకి పంచులు విసురుతూ తన ఆనందాన్ని సహచరులతో పంచుకున్నాడు గౌతం గంభీర్. గౌతం గంభీర్ గర్జనకు  సంబంధించిన వీడియో కాస్త నెట్టింట్లో తెగ చక్కెర్లు కొడుతుంది. అయితే గతంలో గౌతం గంభీర్ కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు. ఎన్నో ఏళ్ల పాటు అదే జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే కాదు. కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. ఇక అలాంటి కోల్కతా నైట్రైడర్స్ పై లక్నో విజయం సాధిస్తే గౌతం గంభీర్ ఉద్వేగానికి లోను అవడం కొంత మంది ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: