ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో భాగంగా ఎంతో మంది యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారూ అన్న విషయం తెలిసిందే. ఇక వారి ప్రతిభను అద్భుతంగా చూపిస్తున్న తీరు చూస్తుంటే రానున్న రోజుల్లో తక్కువ సమయంలోనే అటు టీమిండియాలో అవకాశం తగ్గించుకునే లాగే కనిపిస్తున్నారు. అలాంటి వారిలో కోల్కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న రింకు సింగ్ కూడా ఒకరు. తనకి వచ్చినవి కొన్ని అవకాశాలు అయినా వచ్చిన అవకాశాన్ని మాత్రం ఎంతో సమర్థవంతంగా వినియోగించుకున్నాడు.


 ప్రతి మ్యాచ్ లో. మంచి  ప్రదర్శన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇటీవలే  తన జీవితంలో పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. అందరూ క్రీడాకారులు లాగానే తాను కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న అంటు రింకు సింగ్ తెలిపాడు. గడిచిన ఐదేళ్లలో కలలో కూడా ఊహించని కష్టాలను చవిచూశా.. 2018 లో తొలిసారి కోల్కతాకు ఎంపికైన సమయంలో అవకాశాలు  వచ్చిన సరే ఇక సరిగ్గా ఆడలేక  పోయాను. కానీ నాపై నమ్మకం ఉంచి జట్టు యాజమాన్యం నన్ను కొనసాగించారు.


 నేను సరైన ప్రదర్శన చేయలేకపోయినా జట్టు యాజమాన్యం నేను వెనుకబడ్డా అని ఆలోచించలేదు. ఇక విజయ్ హజారే ట్రోఫీ లో మోకాలికి గాయం కారణంగా ఒక ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాను. కోలుకోవడానికి దాదాపు ఆరు నుంచి ఏడు నెలల సమయం పడుతుందని చెప్పడంతో అసలు తట్టుకోలేకపోయాను. ఇక ఈ గాయం కారణంగా చాలా రోజులు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో మా నాన్న దాదాపు రెండు మూడు రోజుల వరకు భోజనం కూడా చేయలేదు. ఎందుకంటే మా కుటుంబానికి నేనే జీవనాధారం అంటూ రింకు సింగ్ తెలిపాడు.


 ఆ సమయంలో నాకు నేనే ధైర్యం చెప్పుకునీ.. ఆత్మస్థైర్యంతో కోలుకుంటానని భావించాను అంటు రింకు చెప్పుకొచ్చాడు. అయితే 2018 తర్వాత 2020 లో అవకాశాలు వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ ఈ ఏడాది ఐపీఎల్ లో మాత్రం  ఇప్పటి వరకు 7 మ్యాచ్ లూ ఆడి  176 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 148.72 గా ఉండడం గమనార్హం. ఇటీవల కాలంలో జరిగిన మ్యాచ్లో కోల్కతా ఓటమి ఖాయం  అనుకుంటున్న సమయంలో క్రీజులోకి వచ్చిన రింకు 15 బంతుల్లో  40 పరుగులు చేశాడు. ఆ తర్వాత వికెట్ కోల్పోయాడు. దీంతో కోల్కతా ఓడిపోయిన రింకు మాత్రం  అందరి మనసులను గెలుచుకున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: