ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం ముగింపు దశకు చేరు కుంటుంది అన్న విషయం తెలిసిందే. ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకునేందుకు ప్రస్తుతం అన్ని జట్లు పోటీ పడుతున్నాయి. ఇకపోతే పడితే గుజరాత్ లక్నో జట్లు ప్లే ఆఫ్ ఇప్పటికే అడుగు పెట్టాయ్. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం ప్రస్తుతం ఐదు జట్లు హోరా  హోరీగా పోరాడు తున్నాయి. దీంతో ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగం గా ప్రతి మ్యాచ్ ఎంతో ఆసక్తికరం గా మారి పోయింది అని చెప్పాలి.


 అయితే లీగ్ దశ మ్యాచ్ లూ ముగింపుకు వచ్చిన నేపథ్యం లో ఇప్పటికే ప్లే ఆఫ్ కు సంబంధించిన పూర్తి వివరాలను కూడా అటు బీసీసీఐ ప్రకటించింది అన్న విషయం తెలిసిందే.. అంతే కాకుండా ఇక ఫైనల్ మ్యాచ్ ఎక్కడ నిర్వహించ బోతున్నారు అనే విషయం పై కూడా క్లారిటీ ఇచ్చింది. అయితే కరోనా వైరస్ కారణం గా గత కొన్ని రోజుల నుంచి ముగింపు వేడుకలు నిర్వహించడం లేదు బిసిసిఐ. కానీ ఈ ఏడాది వైరస్ ప్రభావం తగ్గడం తో ముగింపు వేడుక నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.


 ముగింపు వేడుకల లో భాగం గా ఎంతో మంది బాలీవుడ్ సినీ సెలబ్రిటీల తో  ప్రత్యేక కార్య క్రమం నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ నేపథ్యం లోనే అటు ఫైనల్ మ్యాచ్ నిర్వహణ పై షెడ్యూల్ విషయం లో కీలక మార్పులు చేయడానికి సిద్ధమైంది అని తెలుస్తోంది. సాధారణం గా ఫైనల్ మ్యాచ్ ముందు గా అనుకున్న షెడ్యూల్ ప్రకారం 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇక ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యం లో ఎనిమిది గంటలకు ప్రారంభించ బోతున్నట్లు తెలుస్తోంది. ముగింపు వేడుకల నేపథ్యం లోనే ఇక ఇలా ప్రారంభ సమయం మార్పు చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl