ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ప్రస్తుతం మరో ఆసక్తికర మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ లో గుజరాత్, లక్నో జట్లు స్థానం దక్కించుకున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక మిగిలిన రెండు స్థానాల్లో చోటు దక్కించుకోబోయే జట్టు ఏది  అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇటీవలే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టు విజయం సాధించడంతో సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల ప్లే ఆఫ్ అవకాశాలు మొత్తం మూసుకుపోయాయి. దీంతో ఈ రెండు జట్లు కూడా ఇంటి బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.


ఇకపోతే నేడు ఐపీఎల్ లో భాగంగా మరో ఆసక్తికర మ్యాచ్ జరగబోతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే పేలవ ప్రదర్శన కారణంగా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. ఇక ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నేడు మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు పైచేయి సాధించి విజయం అందుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.


 ఈ క్రమం లోనే బ్రబోర్న్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది అనేది తెలుస్తుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టిక లో రెండో స్థానం లో కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ మ్యాచ్లో విజయం సాధించింది అంటే అటు ప్లేఆఫ్ లో అడుగుపెట్టిన మూడవ జట్టు గా రికార్డు సృష్టిస్తోంది. ఈ క్రమం లోనే ఇక చెన్నై సూపర్ కింగ్స్ జరగబోయే  మ్యాచ్ విజయవంతం గా ముగించాలని ఎంతో కసితో ఉంది రాజస్థాన్ రాయల్స్ జట్టు. మరోవైపు ఇప్పటికే ఓటములతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్ ఇక ఇప్పుడు విజయం తో పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl