ఐపిఎల్ సీజన్ 15 చివరి దశకు చేరుకుంది. ఇక కేవలం లీగ్ దశలో 5 మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ ప్లే ఆప్స్ లో ఇప్పటికీ రెండు జట్లు మాత్రమే అర్హత సాధించాయి. మిగిలిన రెండు జట్లు పై ఒక అవగాహన రావాలంటే ఈ రోజు మరియు రేపు వరకు ఆగాల్సిందే. అందులో ఒక స్థానంపై ఈ రోజు అవగాహన వస్తుంది. ఈ రోజు చెన్నై మరియు రాజస్థాన్ లు సాయంత్రం తలపడనున్నాయి.

రాజస్థాన్ ఈ మ్యాచ్ లో గెలిస్తే... 18 పాయింట్ లతో ప్లే ఆఫ్ కు చేరుతుంది. ఒకవేళ గొప్ప విజయం సాధిస్తే మంచి రన్ రేట్ సాధించి పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి చేరుతుంది. కర్మ కాలి ఓడిందే అనుకో... మళ్లీ ఢిల్లీ మ్యాచ్ పూర్తయ్యే వరకు క్లారిటీ రాదు. కాబట్టి అప్పటి వరకు లేకుండా ఈ మ్యాచ్ లో విజయం సాధించి ప్లే ఆఫ్ కు చేరాలని... శాంసన్ సేన బావిస్తోంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో ఆడిన 13 మ్యాచ్ లలో 4 మ్యాచ్ లు మాత్రమే గెలిచి విమర్శలు ఎదుర్కొంది. ఇక సీజన్ లో లాస్ట్ మ్యాచ్ ఈ రోజు ఆడనుంది. కనీసం ఈ మ్యాచ్ అయినా గెలిచి సీజన్ ను గెలుపుతో ముగించాలని ఫ్యాన్స్ మరియు టీమ్ యాజమాన్యం అనుకుంటున్నారు.

అయితే ఫామ్ లో ఉన్న శాంసన్ సేనను అడ్డుకోవడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా బట్లర్, శాంసన్ లు మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక గత జైస్వాల్ కూడా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని చెలరేగి ఆడుతున్నాడు. కాగా గత రెండు మ్యాచ్ లకు దూరమైన హెట్ మేయిర్ స్ రోజు మ్యాట్ లో ఆడే అవకాశం ఉంది. మరి ధోనీ ఎలా శాంసన్ జట్టును ను అడ్డుకుంటాడు అన్నది చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: