క్రికెట్ ప్రేమికులకు సౌరవ్ గంగూలీ పరిచయం అక్కర్లేదు. కోల్‌కతాకు చెందిన ఈ మాజీ క్రీడాకారుడు టెస్ట్ కెప్టెన్ గా భారత్ కు పలు విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఎడమచేతితో బ్యాటింగ్, కుడిచేతితో మీడియం పేస్ బౌలింగ్ చేయడం గంగూలీకి వున్న అరుదైన ప్రతిభ. ఇతడిని ముద్దుగా క్రికెట్ ప్రేమికులు బెంగాల్ టైగర్, కోల్‌కతా యువరాజు, దాదా అని రకరకాలుగా పిలుచుకునే వారు. 2002 నుంచి 2005 వరకు భారత టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించి, అత్యధిక టెస్ట్ విజయాలు.. సుమారుగా 21 సార్లు విజయం సాధించిపెట్టిన భారత కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు.  
 
2003 ప్రపంచ కప్ క్రికెట్ లో ఫైనల్ చేరిన భారత జట్టుకు నాయకుడు ఇతనే. 2008 అక్టోబరులో ఆస్ట్రేలియా తో జరిగిన టెస్టు సిరీసుతో అంతర్జాతీయ గతి నుండి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం bcci అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ తన సేవల్ని ఇంకా కొనసాటిస్తున్నాడు. కాగా రీసెంటుగా దాదా కోల్‌కతాలోని ఓ కొత్త బంగ్లాను కొనుగోలు చేశాడు. గంగూలీ కొనుగోలు చేసిన కొత్త బంగ్లా విలువ సుమారు రూ. 40 కోట్లు ఉంటుందని సమాచారం. గంగూలీ దాదాపు 48 సంవత్సరాల తరువాత తన పూర్వీకుల ఇంటి నుంచి, కొత్త భవనంలో త్వరలో పాలుపొంగించనున్నాడు.
 
వివరాల్లోకి వెళితే, కోల్‌కతా లోని లోవర్‌ రాడన్‌ స్ట్రీట్‌లో 23.6 కొత్తా (దాదాపు 10,280 స్క్వేర్‌ఫీట్‌) కలిగిన రెండంతస్తుల భవనాన్ని గంగూలీ కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ ప్రాపర్టీ మొత్తాన్ని భార్య డోనా, కూతురు సనా, తల్లి నిరూపమ్‌ గంగూలీ పేరిట సమానం గా రిజిస్ట్రేషన్‌ చేసినట్లు గుసగుసలు వినబడుతున్నాయి. కాగా ఇది పాత భవనమే అయినప్పటికి, రోడ్డుకు దగ్గరగా ఉండడం, టవర్‌ డెవలప్‌మెంట్‌కు అనుమతి ఉండడంతో దాదా ఎంతో మక్కువతో దీన్ని కొనుగోలు చేసాడని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: