టీమ్ ఇండియా లో మహేంద్ర సింగ్ ధోనీ లాగా ఒక మంచి వికెట్ కీపర్ గా కీలక సమయంలో మెరుపు ఇన్నింగ్స్ ఆడే ఫినిషర్ గా పాత్ర పోషిస్తాడు అనుకున్నా రిషబ్ పంత్ కొంతమేర మాత్రమే రాణించగలుగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ధోనీ లాగా మెరుపువేగంతో వికెట్ కీపింగ్ చేయకున్నా పర్వాలేదు అని అనిపిస్తున్నాడు. ఇక మరోవైపు ఇక మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడానికి వచ్చి కేవలం అప్పుడప్పుడు మాత్రమే భారీగా పరుగులు చేస్తూ ఉండటం గమనార్హం. మిడిలార్డర్లో ఒత్తిడి కారణంగానే రిషబ్ పంత్ విఫలం అవుతున్నాడు ఉన్నది ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకులు చెబుతున్న మాట.


 ఎంతో ధాటిగా బ్యాటింగ్ చేసే రిషబ్ పంత్ మిడిలార్డర్లో కాకుండా ఓపెనర్గా  వస్తే బాగుంటుందని పలువురు మాజీ లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు భారత డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఇదే విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు రిషబ్ పంత్ విలువైన ఆస్తి అంటూ తెలిపాడు. మేము పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడేది 50 లేదా 100 కొట్టడానికి కాదు.. ప్రత్యర్థి, పరిస్థితులతో సంబంధం లేకుండా వేగంగా పరుగులు చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటాము అంటూ మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు.


 అలాగే రిషబ్ పంత్ కూడా ఎంతో దాటిగా ఆడగల సత్తా ఉన్న వాడు. అయితే ఇక జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు 5వ స్థానంలో బ్యాటింగ్ చేసే ఆటగాడు ఎంతో బాధ్యతాయుతంగా ఆడాలి ఉంటుంది. ఇలాంటి ఒత్తిడిలో  రిషబ్ పంత్ విఫలమవుతున్నాడు. అదే ఓపెనింగ్ వస్తే ఫీల్డ్ నిబంధనలు ఉంటాయి కాబట్టి రిషబ్ పంత్ విజయవంతం అవుతాడు అనే నమ్మకం ఉంది అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. అయితే వీరేంద్ర సెహ్వాగ్ తో పాటు సచిన్ టెండూల్కర్ సైతం మొదట్లో మిడిలార్డర్లో ఆడి ఆ తర్వాత ఓపెనర్లుగా మారిపోయారు అన్న విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: