గత కొంత కాలం నుంచి పేలవమైన ప్రదర్శన కారణంగా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీ ఇటీవలే జరిగిన మ్యాచ్లో మాత్రం ఏకంగా 73 పరుగులు చేసి మళ్ళి పుంజుకున్నట్లుగానే కనిపించాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగుళూరూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు అనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు కెప్టెన్గా విరాట్ కోహ్లీ ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా భారత జట్టుకు అందించలేకపోయాడు. తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకునీ కీలక ఆటగాడిగా భారత జట్టుకుఐసీసీ ట్రోఫీ అందించే అవకాశం విరాట్ కోహ్లీకి వచ్చింది అని చెప్పాలి.


 అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అటు భారత జట్టు ఐసీసీ ట్రోఫీ గెలవక పోయినప్పటికీ  ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కోహ్లీ కెప్టెన్సీపై విమర్శలు రావడంతో టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకోగా ఆతర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి కూడా అతని తప్పించారు. చివరికి టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకొని పూర్తిగా సారథ్య బాధ్యతలు దూరమయ్యాడు విరాట్ కోహ్లీ. మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు విరాట్ కోహ్లీ. టీమిండియాకు ఆసియా కప్ తో పాటు టీ20 ప్రపంచ కప్ అందించడమే నా టార్గెట్ అంటూ చెప్పుకొచ్చాడు.

 దీని కోసం తనకు సాధ్యమైనంత కష్టపడటానికి ప్రయత్నిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయంలో ఎంతో సమతూకంగా ముందుకు సాగాలి అంటూ కోహ్లీ తెలిపాడు. ఇందుకోసం కొంత విరామం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి నేను కుదుర్చుకునీ సెట్ అయితే మాత్రం ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా భారత జట్టుకు ఐసీసీ ట్రోఫీలు అందించడానికి ఏం చేయడానికైనా సిద్ధమే అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ ఏడాది టి20 వరల్డ్ కప్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: