ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఈ ఏడాది అద్భుతంగా రాణిస్తాయి అనుకున్న జట్లు  పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచాయ్.. ఎప్పటిలాగానే పేలవ ప్రదర్శన చేస్తాయి  అనుకున్న జట్లు మాత్రం అద్భుతంగా రాణించాయ్ అన్న విషయం తెలిసిందే. దీంతో  ప్రేక్షకుల అంచనాలు తారుమారయ్యాయి. ఇప్పటివరకు ఐపీఎల్లో ఎక్కువసార్లు  టైటిల్ గెలిచి చాంపియన్ లుగా సాగుతున్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు దారుణమైన ప్రదర్శన కారణంగా విమర్శలు ఎదుర్కోవడమే కాదు ప్లే ఆఫ్ లో అడుగు పెట్టకుండానే ఐపీఎల్ నుంచి నిష్క్రమించడం గమనార్హం.

 ఈ క్రమంలోనే ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా కొత్త జట్టు ఛాంపియన్ గా అవతరించి పోతుంది అని తెలుస్తోంది. అయితే ఐపీఎల్ లో భాగంగా ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ లక్నో జట్లు ప్లే ఆఫ్ లో అడుగుపెట్టాయి. ఇక ఇటీవల ప్లే ఆఫ్ లో అడుగు పెట్టడానికి అడుగు దూరంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ ఆడింది.  మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 150 పరుగులు మాత్రమే చేసింది.


 ఈ క్రమంలోనే 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 19.4 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్ చేదించడం  గమనార్హం. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 59 పరుగులతో రాణించాడు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 40 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇలా చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం తో అటు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కి దూసుకుపోయిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే యాప్ లో కూడా చోటు దక్కించుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే రాజస్థాన్ కప్పు గెలవాలని ఈ సారి బలంగా కోరుకుంటున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: